Case Filed Against KTR :తెలంగాణసీఎంరేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించాడని కేటీఆర్ చేసిన ఆరోపణలపై పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద ఆయనపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో క్రిమినల్ కేసు - Police CASE ON KTR - POLICE CASE ON KTR
Case Filed Against KTR : కేటీఆర్‌పై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి డబ్బులు పంపారని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బంజారాహిల్స్ పీఎస్‌కు పంపించారు.
police_case_on_ktr
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 1:04 PM IST
హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు పంపించారు. ఎన్నికల వేళ ఇతర పార్టీల్లోకి బీఆర్ఎస్ నేతల వలసలు, మద్యం కేసులో కవిత అరెస్ట్‌తో పాటు తాజాగా కేటీఆర్‌పై కేసులు గులాబీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.