Cantonment MLA candidate Decided by KCR :కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) మృతితో ఖాళీ ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక షురూ అయింది. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత సోదరి నివేదితకు పార్టీ టికెట్‌ను ఇచ్చింది. అయితే ఉగాది తర్వాత మాత్రమే నివేదిత పేరును అధికారికంగా కారు పార్టీ ప్రకటించనుంది.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ అభ్యర్థి(BRS Cantonment Candidate)గా ఎవరిని బరిలో దించాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా నివేదిత పేరును ఖరారు చేయడంతో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది.
అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ : దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలలో ఉంటానని గత నెలలోనే చెప్పారు. ఈ విషయంపై కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా సాయన్న కుటుంబం ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. అన్ని పార్టీలు ఉపఎన్నిక(Cantonment Bi Poll)ను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ఆమె కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నారాయణ శ్రీ గణేశ్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటనను ఏఐసీసీ అధికారికంగా చేసింది. మరి బీజేపీ మాత్రం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ - నారాయణ శ్రీ గణేశ్‌కు ఛాన్స్