తెలంగాణ

telangana

ETV Bharat / politics

'రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్​ఎస్​తో పొత్తు - వారంతా మా కూటమిని నిందించడం హాస్యాస్పదం'

RS Praveen Kumar Tweet about BRS BSP Alliance : రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీఆర్​ఎస్​తో పొత్తు కట్టామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ పేర్కొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒకచోట పొత్తులతో రాజకీయంగా ఎదిగినవేనన్న ఆయన, దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదన్నారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడూ మాట్లాడని వీళ్లు, కేవలం బీఆర్‌ఎస్‌ - బీఎస్పీ కూటమిని నిందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

RS Praveen Kumar
RS Praveen Kumar Tweet about BRS BSP Alliance

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 7:16 PM IST

RS Praveen Kumar Tweet about BRS BSP Alliance : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్​ఎస్​ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పాటునకు అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో రాజ్యాంగం, లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పు దృష్టిలో ఉంచుకొని బహుజన సాధికారత - రక్షణ - భవిష్యత్తు వంటి లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన 'ఎక్స్‌' వేదికగా స్పందించారు.

పార్టీలు తమ తమ సిద్ధాంతాలు, బలాలు, బలహీనతలు దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విజయం కోసం వ్యూహాలు మార్చుకోవడం సర్వసాధారణమని ప్రవీణ్​కుమార్ స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒకచోట పొత్తులతో రాజకీయంగా ఎదిగినవేనని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదన్నారు. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడూ మాట్లాడని వీళ్లు, కేవలం బీఆర్‌ఎస్‌ - బీఎస్పీ కూటమిని నిందించడం హాస్యాస్పదంగా ఉందని హితవు పలికారు.

దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలనే బీఆర్​ఎస్​తో పొత్తు : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నన్ను తిట్టండి - పార్టీని కాదు : ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేడ్కర్, ఫూలే, కాన్షీరాం ఫొటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికి పందలకు తమ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదని ఆక్షేపించారు. చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రే సమాధానం చెబుతుందని, తనతో పాటు చాలా రోజులు ప్రయాణించిన వెంకటేశ్​ చౌహాన్, పిల్లుట్ల శ్రీను లాంటి కొంతమంది తమ్ముళ్లు వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే తనను విమర్శించినా సమస్యేం లేదని, తల్లి లాంటి పార్టీని కాదని స్పష్టం చేశారు. దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉందని గుర్తు చేశారు.

నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంతమంది తమ్ముళ్లు వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడారు. మీకందరికీ ఓ సలహా. మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శించండి. సమస్యేం లేదు. తల్లి లాంటి మన పార్టీని కాదు. దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది. మీ నిస్సహాయత నేను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలు నా గుండెలోనే దాచుకుంటా. మిమ్మల్ని, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపై నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటా. - ప్రవీణ్​ కుమార్​ , బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

'బహుజన రాజ్య పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details