తెలంగాణ

telangana

ETV Bharat / politics

'సీఎం రేవంత్​ అలా అనడం మానేయాలి - తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడొద్దు' - KTR Fires On CM Revanth Reddy - KTR FIRES ON CM REVANTH REDDY

KTR Fires On CM Revanth : రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం రేవంత్​ మానేయాలని బీఆర్ఎస్ సీనియర్​ నేత కేటీఆర్​ కోరారు. గతంలో తాము పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్నింగ్‌ ప్లాంట్‌, అమరరాజా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తీవ్ర నష్టమని హెచ్చరించారు.

KTR Fires On CM Revanth
KTR Lashed CM Revanth On Investments Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 9:39 AM IST

KTR Lashed CM Revanth On Investments Issue : తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా సీఎం మాట్లాడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తిమంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం మానేయాలని రేవంత్‌కు హితవు పలికారు.

తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాల వల్ల తెలంగాణకు నష్టం జరగకూడదని కేటీఆర్​ ఆకాంక్షించారు. తమ హయాంలో పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమర్​ రాజాను ఒప్పించేందుకు గతంలో చాలా కష్టపడ్డామని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులందరికీ సముచిత గౌరవం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా ఉండాలని వివరించారు. గతంలో కేన్స్ టెక్నాలజీ రాష్ట్రం నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందన్న ఆయన, ఇప్పుడు కార్నింగ్ ప్లాంట్‌, అమర్​ రాజా కంపెనీలు చెన్నైకి వెళ్లిపోతే అది విపత్తు అని హెచ్చరించారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బతీసేలా సీఎం మాట్లాడొద్దు. రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు మేం చాలా కష్టపడ్డాం. రాజకీయ విభేదాలతో తెలంగాణకు నష్టం జరగకూడదు. కార్నింగ్‌ ప్లాంట్‌, అమరరాజా కంపెనీలు వెళ్లిపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం. పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నా. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందనడం సీఎం మానేయాలి. -కేటీఆర్ ట్వీట్

సిసోడియాకు బెయిల్ వచ్చింది కదా, త్వరలోనే కవితకు కూడా బెయిల్ వస్తుంది! : కేటీఆర్ - BRS Leader KTR On Kavitha Bail

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌కు తీరని నష్టం : కేటీఆర్‌ - KTR Reacted to Sunkishala Issue

ABOUT THE AUTHOR

...view details