KTR Fires on CM Revanth Over Party Defections :ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే, రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు అందుకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రచారంలో నీతులు? ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా? అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం నేరమని, ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమని, భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమని నాడు అన్నారని గుర్తు చేశారు. చివరికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమని, రాజీనామా చేయకుండా చేరితే ఊళ్ల నుంచే తరిమికొట్టమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు.