తెలంగాణ

telangana

ETV Bharat / politics

కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఫుల్ ఫైర్ - సందీప్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ - మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్

BRS MLAs Fire on Minister Komati Reddy : కాంగ్రెస్ పాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారంటూ, మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుర్భాషలాడిన తీరు హేయనీయమని ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు. సందీప్ రెడ్డికి తక్షణమే మంత్రి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మాజీ మంత్రులు డిమాండ్ చేశారు.

Harish Rao Comments on Minister Komati Reddy
BRS MLAs Fire on Minister Komati Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 10:21 PM IST

BRS MLAs Fire on Minister Komati Reddy :ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహారించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - బీఆర్​ఎస్​ జడ్పీ ఛైర్మన్ మధ్య మాటల యుద్ధం

సందీప్ రెడ్డిపై మంత్రి నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, జడ్పీ ఛైర్మన్​కు మంత్రి కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్(BRS Working President) అన్నారు.

KTR Fire on Congress Party : ఇటీవల రైతుబంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి, నేడు యాదాద్రి భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాష లాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శమన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని,గులాబీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జడ్పీ ఛైర్మన్ సందీప్‌ రెడ్డితో ఫోన్​లో మాట్లాడిన కేటీఆర్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ(Congress Govt) ఎంత దుర్మార్గపూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు అయ్యేదాకా ఇలాగే కొట్లాడుదామని సందీప్ రెడ్డితో కేటీఆర్ అన్నారు.

Harish Rao Comments on Minister Komati Reddy : కాంగ్రెస్ 'ప్రజాపాలన'లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిని దుర్భాషలాడారంటూ ఎక్స్​లో వీడియోని షేర్ చేశారు.

అధికార బలం, పోలీసుల అండతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సందీప్ రెడ్డిని బలవంతంగా బయటకుపంపారని ఇది కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వాదులంతా(Democrats) కోమటి రెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చిన హరీశ్ రావు, మంత్రి కోమటి రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు

Jagadeesh Reddy on Minister Komati reddy :భువనగిరి జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి అనుచరులు చేసిన దాడిని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి అయ్యాక అహంకారం పెరిగి ఆటవికుడిలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. అధికార మదం తలకెక్కి పోలీసుల అండ చూసుకుని, గుండాలను అనుచరులను ఉసిగొల్పి క్యాబినెట్ హోదా కలిగిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్యగా జగదీశ్ రెడ్డి అభివర్ణించారు.

తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి బాసులనే ఎదుర్కొన్నామని, తమకి ఇలాంటివి కొత్త కాదన్నారు. కోమటిరెడ్డి మాటలు విని స్వామి భక్తి ప్రదర్శించి సందీప్ రెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను(Police officers) కోరారు. ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజా క్షేత్రంలో తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని కోమటిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ ఫుల్ ఫైర్ - సందీప్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

కాంగ్రెస్​కు పాలన చేతకాకపోతే కేసీఆర్​ను అడగండి : జగదీశ్​ రెడ్డి

సీఎం రేవంత్​ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details