తెలంగాణ

telangana

ETV Bharat / politics

బీఆర్ఎస్‌ మరో షాక్ - సీఎం రేవంత్‌ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య - సీఎం రేవంత్‌ను కలిసిన కాలె యాదయ్య

BRS MLA Kale Yadaiah Meets CM Revanth : బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, మరికొందరు త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమవుతోంది.

BRS MLA Kale Yadaiah Meets CM Revanth
BRS MLA Kale Yadaiah Meets CM Revanth

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 3:06 PM IST

Updated : Mar 5, 2024, 4:28 PM IST

BRS MLA Kale Yadaiah Meets CM Revanth : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండటంతో వారంతా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీఆర్ఎస్ నేత కూడా సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Chevella MLA Meets CM Revanth : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు ఉన్నారు. దాదాపు అరంగట పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే కాలె యాదయ్య సీఎంతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్న క్రమంలో కాలె యాదయ్య కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

కేసీఆర్‌తో ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ భేటీ

ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి కీలక నేతలైన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు విడిపోయారు. వెంకటేశ్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా, బీబీ పాటిల్, రాములు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు, బీబీ పాటిల్‌కు జహీరాబాద్, రాములు కుమారుడికి నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ టికెట్లను బీజేపీ ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరిన వెంకటేశ్ నేతకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ తెలిపింది.

మరోవైపు అంతకుముందు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీతా రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికి హస్తం పార్టీ తమ పార్టీల్లో సముచిత స్థానం కల్పించి గౌరవించుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇలా లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులంతా వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కీలక నేతలు వెళ్లిపోవడంతో ఇప్పుడు ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఆ పార్టీ సందిగ్ధంలో పడినట్లు సమాచారం.

బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి జహీరాబాద్ ఎమ్మెల్యే - క్లారిటీ ఇచ్చిన మాణిక్​ రావు

కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు

Last Updated : Mar 5, 2024, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details