తెలంగాణ

telangana

ETV Bharat / politics

'ఆస్పత్రుల్లోని క్యాంటీన్లకు పెండింగ్​ బిల్లులు చెల్లించట్లేదు - ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగులు, వైద్యులకు ఆహారం అందట్లేదు' - BRS MLA Harishrao Tweet on TG Govt

BRS Leader Harishrao Tweet on Telangana Govt : ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించలేక రోగులు, వైద్యులకు ఆహారం అందట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 3:40 PM IST

BRS Leader Harishrao Tweet on Telangana Govt
BRS Leader Harishrao Tweet on Telangana Govt (ETV Bharat)

Harishrao Tweet Telangana Govt Not Paid Bills for Canteens in Hospitals : రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో క్యాంటీన్లకు రూ.20 కోట్ల బిల్లులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోగులు, వైద్యులకు ఆహారం అందట్లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాల్లేవు : అలాగే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఎక్స్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు గురువారం ట్వీట్​ చేశారు. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ తదితర 78 విభాగాలలో పని చేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు చెల్లించకపోవడం ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మండిపడ్డారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్ల అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 3 నెలల పెండింగ్‌ జీతంతో పాటు, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులపై లాఠీ ఝళించడం దారుణం : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరమని ఎక్స్‌ వేదికగా మంగళవారం ట్వీట్‌ చేశారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేరుకుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని, ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు ఝళిపించినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

కోమటిరెడ్డి అలా మాట్లాడటం చాలా బాధాకరం - హరీశ్‌ రావు ట్వీట్ - HARISH RAO FIRES ON KOMATIREDDY

దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ లేదనటం దారుణం: హరీశ్‌రావు - Harish Rao on Paddy Bonus Issue

ABOUT THE AUTHOR

...view details