తెలంగాణ

telangana

ETV Bharat / politics

'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్​ఎస్​ నేతలు - ktr comments on medigadda

BRS Leaders Visited Medigadda : బీఆర్​ఎస్​ నేతల బృందం నేడు మేడిగడ్డను సందర్శించింది. మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు సహా పలువురు నేతలు, బీఆర్​ఎస్​ కార్యకర్తలు మేడిగడ్డలో కుంగిన పియర్స్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

brs chalo medigadda tour
BRS Leaders Visited Medigadda

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 5:26 PM IST

Updated : Mar 1, 2024, 7:53 PM IST

BRS Leaders Visited Medigadda : బీఆర్​ఎస్​ నేతల బృందం నేడు మేడిగడ్డను సందర్శించింది. మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు సహా పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయని ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై కోపం, రాజకీయ వైరం ఉంటే తీర్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన, మేడిగడ్డను మరమ్మతులు చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్పారని, ఈ మేరకు వచ్చే వర్షాకాలంలోగా మరమ్మతులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు - కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదు : కేటీఆర్

ఈ క్రమంలోనే మేడిగడ్డ అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. రైతులకు మాత్రం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగు నీరు లేక కరీంనగర్​లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే వస్తున్నాయని తెలిపారు. సాగు నీరు ఎత్తిపోస్తే పంటలకు లాభం చేకూరుతుందని వివరించారు. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన, కమిటీ వేసి నివేదిక తీసుకోవాలని కోరారు. వరద వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు.

బీఆర్ఎస్ చలో మేడిగడ్డ - ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నేతలు రె'ఢీ'

మాపై కోపం ఉంటే తీర్చుకోండి. రైతులపై కాదు. రైతులు, రాష్ట్రంపై పగ పట్టవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పగ, కోపం ఉంటే రాజకీయంగా మాపై తీర్చుకుంటే ఇబ్బంది లేదు. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉంది. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయి. నాగార్జునసాగర్‌, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయి. సాగర్‌, శ్రీశైలంలో వచ్చిన లీకేజ్‌లను మేం రాజకీయం చేయలేదు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నాం. - కేటీఆర్‌, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

మేడిగడ్డపై కాంగ్రెస్​ది రాజకీయం - రైతులకు నీళ్లివ్వకుండా కాలయాపన చేయడం దారుణం : కేటీఆర్

తోపులాట : అంతకుముందు మేడిగడ్డ వద్ద బీఆర్​ఎస్​ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అధికారులు బ్యారేజీ గేటును మూసివేయడంతో బీఆర్​ఎస్​ కార్యకర్తలు గేటును తోసుకుంటూ బ్యారేజీపైకి భారీగా చేరుకున్నారు. అనంతరం కేటీఆర్‌, హరీశ్‌ రావు, కడియం సహా పలువురు నేతలు మేడిగడ్డలో కుంగిన పియర్స్​ను పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద తోపులాట

రేవంత్​కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్

Last Updated : Mar 1, 2024, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details