BRS Leader KTR Visit Rajanna Sircilla District :బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, నేతన్నలను ఆదుకున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) అన్నారు. బతుకమ్మ చీరల నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. తమ ప్రభుత్వంలో మంజూరైన ముస్తాబాద్ రోడ్డును కాంగ్రెస్ రద్దు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నేతన్న(Handloom Worker)లు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు ఏం చేతకాదని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్, కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
KTR Siricilla Tour :ఎల్ఆర్ఎస్పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే సిరిసిల్లలో ఎల్ఆర్ఎస్పై నిరసన తెలపాలన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని తెలిపారు. డిసెంబరు 9న అన్ని హామీలు నెరవేరుస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చి తప్పారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేవలం నాలుగు లక్షల ఓట్ల తేడాతోనే మాత్రమే ఓడిపోయిందని గుర్తు చేశారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం సన్నాహక సమావేశం, ముస్తాబాద్‌లో కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు కాకపోతే ఆ పార్టీని బొందపెడతాం : కేటీఆర్