BRS Leader Kavitha Into CBI Custody :రెండు రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉండనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారం చేసుకును దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించనున్నారు. రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలతో కవిత శుక్రవారం సీబీఐ కార్యాలయానికి తరలించారు. మద్యం విధానం, అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా దర్యాప్తు సంస్థ పేర్కొంది. కస్టడీలో ఉన్న కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి అధికారులు వైద్య పరీక్షలు చేయించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు భర్త అనిల్, కేటీఆర్ సహా పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిసే అవకాశం ఉంది.
సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్ - విచారణ ఈ నెల 26కు వాయిదా - mlc kavitha delhi liquor scam case
Kavitha CBI Arrest :దిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ, లోతుగా విచారించేందుకు 5 రోజులు కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.