తెలంగాణ

telangana

ETV Bharat / politics

అలాంటి థంబ్​నెయిల్స్ మరోసారి కనిపించాయో? - యూట్యూబ్ ఛానెల్స్​కు హరీశ్ రావు స్వీట్ వార్నింగ్ - HARISH RAO WARNS YOUTUBE CHANNELS - HARISH RAO WARNS YOUTUBE CHANNELS

Harish Rao Clarity On Party Changing : తాను పార్టీ మారుతున్నానంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తప్పుడు థంబ్​నెయిల్స్​తో ఓ రాజకీయ నేత నిబద్ధతను దెబ్బతీయడం సమంజసం కాదని హితవు పలికారు. ఇలాంటివి రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని యూట్యూబ్ ఛానెల్స్​కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Harish Rao Clarity On Party Changing
Harish Rao (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 4:09 PM IST

Harish Rao On Fake News :బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పార్టీ వీడనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరతారని కొందరు కాదు కాంగ్రెస్​లో చేరతారని మరికొందరు వదంతులు సృష్టిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇవాళ తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన హరీశ్ రావు నిరుద్యోగులు, గ్రూప్ -, 2 అభ్యర్థులు, నీట్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ చివరలో ఆయన తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించారు.

యూట్యూబ్ ఛానెల్స్​కు హరీశ్ రావు స్వీట్ వార్నింగ్ (ETV Bharat)

Harish Rao Warns YouTube Channels Over Fake News : సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ కొంతమంది, కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నానంటూ మరికొంత మంది సృష్టిస్తున్న వదంతులను కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల ఓ రాజకీయ నాయకుడి నిబద్ధత, విశ్వసనీయత దెబ్బతింటుందని తెలిపారు. అందువల్ల ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని కోరారు.

Harish Rao Warns YouTube Media Over Fake Thumbnails :తప్పుడు థంబ్​నెయిల్స్​తో లైకులు, వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయొద్దని సూచించారు. అలా చేస్తే తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని యూట్యూబ్ ఛానెల్స్​కు హరీశ్ రావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత ఏం చెబితే ఓ కార్యకర్తగా అందుకు అనుగుణంగా నడుచుకుంటానని హరీశ్ రావు పునరుద్ఘాటించారు.

"వాస్తవాలుంటే ఎంత క్రియేటివ్​గా అయిన థంబ్​నెయిల్స్ పెట్టండి. కానీ ఒక రాజకీయ నేత నిబద్ధతను దెబ్బతీసేలా మాత్రం చేయకండి. మా పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. అయినా వినకుండా కొందరేమో బీజేపీలో చేరుతున్నా అంటారు. ఇంకొందరేమో కాంగ్రెస్ లో చేరుతున్నానని పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక ఇంకొందరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ వదంతులు సృష్టిస్తున్నారు. ఇప్పటికీ నేను చాలా రిక్వెస్ట్​ చేస్తున్నాను. కానీ మళ్లీ ఎవరైనా తప్పుడు వార్తలతో వ్యూస్ కోసం తప్పుడు థంబ్​నెయిల్స్ పెడితే కచ్చితంగా తీవ్రమైన చర్యలుంటాయి". - హరీశ్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి

ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట అప్పుడలా ఇప్పుడిలా : హరీశ్‌రావు - Harish Rao Fires On Congress

ABOUT THE AUTHOR

...view details