తెలంగాణ

telangana

ETV Bharat / politics

జనంలో ఉందాం, మళ్లీ పుంజుకుందాం - వలసల వేళ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం - Lok Sabha Elections 2024

BRS Focus on Strengthening Party : నాయకులు పార్టీ మారడంపై ఆందోళన చెందకుండా శ్రేణులను కాపాడుకోవడం, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావనలో బీఆర్ఎస్ నాయకత్వం కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్‌లో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదంటూ కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

BRS Focus on Strengthening Party
BRS Focus on Strengthening Party

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 7:14 AM IST

కార్యకర్తల్లో స్థైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రయత్నం

BRS Focus on Strengthening Party :భారత్ రాష్ట్ర సమితి కీలక నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి నాలుగు నెలలు కూడా గడవకముందే నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు.

BRS Leaders Migration 2024:బీఆర్ఎస్‌ను వీడి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లో ఎంపీ అభ్యర్థులుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. మరికొందరు ఇతర సమీకరణాలు, అంశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. లోక్‌సభ అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పగా, ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కడియం కావ్య (Kadiyam Kavya Drop MPElection)పోటీ చేయబోనని లేఖ రాసి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేశవరావు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటన :భారత్ రాష్ట్ర సమితిలో కేసీఆర్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు (KK To Join In Congress)తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్‌ను వీడేందుకు రంగం సిద్ధమైంది. హస్తం పార్టీ నేతలు కడియం నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ కారణాల వల్ల గులాబీ పార్టీకి ప్రజల్లో ఆదరణ కోల్పోతోందని, ప్రజలకు సేవ చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గం అవసరమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

రంజిత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి ఆస్కార్‌ నటుల కంటే ఎక్కువగా నటించారు : కేటీఆర్‌ - BRS Chevella Parliamentary Meeting

Lok Sabha Elections 2024 :ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలన్నీ భారత్ రాష్ట్ర సమితి అధిష్ఠానానికి ఇబ్బందికరంగా మారాయి. అసలే అధికారం కోల్పోవడంతోపాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నాయకుల వలసలు మరింత ఇక్కట్లలోకి నెట్టాయి. అయితే ఈ పరిస్థితుల్లో వలసల గురించి ఆందోళన చెంది గులాబీ శ్రేణుల ధైర్యం దెబ్బతీయరాదని బీఆర్ఎస్‌ నాయకత్వం భావిస్తోంది.

BRS Leaders Join in Congress and BJP : ఉద్యమ ప్రస్థానంలో ఎంతోమంది నేతలు భారత్ రాష్ట్ర సమితిలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింతగా పెరిగిందని అంటున్నారు. అదే తరహాలో పార్టీ నుంచి కూడా కొందరు వెళ్లినవారు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. నాయకులు వెళ్లినంత మాత్రాన ప్రజల్లో ఆదరణ తగ్గదని శ్రేణులను కాపాడుకుంటే ఇబ్బందులు ఉండబోవని బీఆర్ఎస్ భావిస్తోంది.

ప్రజాబలం ఉంటే కడియం శ్రీహరి రాజీనామా చేసి గెలవాలి : బీఆర్ఎస్ నేతలు - Lok Sabha Elections 2024

కష్టపడితే మళ్లీ పుంజుకోవచ్చు :అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు వారి అవసరాలు, రాజకీయ స్వార్థం కోసం బీఆర్ఎస్‌ వీడుతున్నారని నాయకత్వం మండిపడుతోంది. అటువంటి నాయకులు పోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగబోదని కష్టపడితే మళ్లీ పుంజుకోవచ్చని చెబుతున్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్నవారికి, నమ్మకంగా ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వడంతోపాటు అవకాశం ఉన్నచోట కొత్త నాయకత్వాన్ని తయారు చేసేలా కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నారు.

నేతలు వలస వెళ్లినప్పటికీ విస్తృతంగా ప్రజల్లో ఉండడం ద్వారా బీఆర్ఎస్‌ను మరింతగా బలోపేతం చేసుకోవచ్చని ఆ దిశగా శ్రేణులను సమాయత్తం చేయాలన్నది అధినాయకత్వం ఆలోచన. అందులో భాగంగానే ఇప్పుడు వెళ్లిన నాయకులు తర్వాత వచ్చి కాళ్లు పట్టుకున్నప్పటికీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా సీనియర్ నేతలతో భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు - Harishrao hot comments

బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపేలా కేటీఆర్‌ ట్వీట్‌ - పోరాట పంథాలో కదం తొక్కుదామని పిలుపు - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details