BRS Focus on Secunderabad, Chevella, Malkajgiri Constituency: శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్‌తో పాటు శివారు నియోజకవర్గాలు బీఆర్ఎస్కు పూర్తి అండగా నిలిచాయి. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలను గులాబీ పార్టీ దక్కించుకొంది. మల్కాజ్‌గిరిలో ఏడింటికి ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క నాంపల్లి మినహా ఆరు స్థానాల్లో కారు విజయం సాధించింది. చేవెళ్ల పరిధిలోని నాలుగు సీట్లలో నెగ్గారు. ఖైరతాబాద్‌లో గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌లో ప్రత్యర్థిగా మారారు. మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ పార్టీతోనే ఉన్నారు.
మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల మూడు లోక్‌సభ స్థానాలపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మూడు నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ తరచూ సమీక్షిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. వస్తున్న సమాచారం ఆధారంగా నేతలను అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
KTR Suggestions To BRS Leaders : నోటిఫికేషన్‌కు ముందే కేసీఆర్ చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలో కేటీఆర్ ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. విస్తృతస్థాయి సమావేశాలతో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచిన నగరవాసులకు ధన్యవాదాలు చెబుతూ లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మద్దతు అడుగుతున్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో, మల్కాజ్‌గిరి పరిధిలోని కూకట్‌పల్లిలో కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొన్నారు.
అచ్చేదిన్ కాదు కాంగ్రెస్ వచ్చాక సచ్చేదిన్ వచ్చింది : కేటీఆర్ - KTR Lok Sabha Election campaign