BRS Election Campaign 2024 : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను లక్ష్యంగా చేసుకుని పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో మాజీమంత్రి హరీశ్‌రావుఆరోపించారు. రైతుల విషయంలో ప్రభుత్వం వైఫల్యాలు తెలిసేలా పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభించామని వివరించారు.
Harish Rao Comments on BJP : సుల్తాన్‌పూర్‌లో జరగనున్న కేసీఆర్ బహిరంగ సభాస్థలిని హరీశ్‌రావు పరిశీలించారు. భారీ ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తమ అధికారాలను కాపాడుకోడానికి రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. అనంతరం బీజేపీ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు.
"రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతోంది. అన్నదాతల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ గెలుస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే. కాంగ్రెస్ రైతులకు ఇస్తానన్న రుణమాఫీ, బోనస్ లోక్‌సభ ఎన్నికల లోపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను."- హరీశ్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే
BRS Leaders Election Campaign: నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(BRS Leader Jagdish Reddy) పాల్గొన్నారు. లీక్, ఫేక్ కథనాలతో కాంగ్రెస్ సర్కార్ కాలం గడుపుతోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థి నేతలు తనపై రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.