BRS Complaint Against Rahul Gandhi :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తుక్కుగూడ సభ(Jana Jatara Sabha)లో రాహుల్ గాంధీ దురుద్దేశపూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి విన్నవించింది.
రాహుల్ గాంధీ అబద్ధాలు, అసత్యాలను మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో బీఆర్ఎస్ పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ ప్రస్తావనను టెలిఫోన్ ట్యాపింగ్ అంశంతో ముడిపెడుతూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలను బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేశారని మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. దీనిపై వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం(ECI) చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో నేనూ ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి