Ex CM KCR Meeting with BRS MLA's : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. పార్టీ వీడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నష్టమేమి లేదని ఎవరు తొందరపడద్దని తెలిపారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం కొందరు శాసనసభ్యులతో సమావేశమైన కేసీఆర్, నేడు పలువురు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రజినీలతో పాటు పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. రానున్న రోజులు తమకే భవిష్యత్తు ఉంటుందని సమావేశమైన వారికి కేసీఆర్ సూచించినట్లుగా సమాచారం.
KCR Fires on Party Defections : హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసి మూణ్నెల్లు దాటినా, ఇప్పటి వరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదని, ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్ర కేసులో ఏ న్యాయవాదులైతే వాదించారో, వారినే గులాబీ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలకు ఎంచుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సహచర పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడంపై పార్టీ సీరియస్‌గా దృష్టిపెట్టిందన్నారు. ఈ అంశంపై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రాతిపదికగా తీసుకొని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని తెలిపారు.