BJP MP Bandi Sanjay on Govt Schemes :రానున్న పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్(BRS) మూడో స్థానానికే పరిమితమవుతుందని, అసలు పోటీ చేద్దామా లేదా అనే భావనలో బీఆర్ఎస్ ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో "గావ్ ఛలో అభియాన్" కార్యక్రమంలో భాగంగా రంగాపూర్‌లో గ్రామంలో ఆయన పర్యటించారు. చేనేత కార్మికుల పనితీరును, సాధకబాధకాలను పరిశీలించారు. వారితో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
Bandi Sanjay Visits Huzurabad : ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పథకాల అమలుకు ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం, ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోందన్నారు.
Bandi Sanjay Fires on BRS : ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చని, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలని, బీఆర్ఎస్ నాయకుడు ఇష్టానుసారంగా పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. ఎన్నికలో తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కారణాలు వెతుకుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్(KCR) అనే వ్యక్తి బయటకు రావటంలేదని, నిన్ననే వచ్చాడని తనకు తెలిసిందన్నారు.
"ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలి. పథకాల అమలుకు ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం, ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోంది". - బండి సంజయ్, బీజేపీ నేత