BJP MP Bandi Sanjay Fires on KCR :కరీంనగర్ కదనభేరి సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ బదులిచ్చారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ(BJP) అని ఉద్ఘాటించారు. కేంద్రం స్మార్ట్ సిటీ ఇస్తే తామే తెచ్చామని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు.
నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం మూడు సార్లు లేఖలు రాసినా నాటి కేసీఆర్ సర్కారు(BRS Party) స్పందించలేదని బండి తెలిపారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెచ్చానని కారు పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పుకుంటున్నారని, తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణలో మరింత కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తాం : అమిత్ షా
"బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ పదాన్ని తొలగించిన తరవాత, మన రాష్ట్రంతో గులాబీ పార్టీ తెగదింపులు చేసుకున్నట్లే. కేసీఆర్, ఆ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. పది సంవత్సరాలు రాజ్యమేలి, కనీసం ప్రజలు చీదరించుకున్న తరువాత మార్పు వస్తుందని తెలంగాణ సమాజం భావించింది. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని మాట్లాడుతున్నారు. అసలు ఆ పని చేసింది ఎవరు కేసీఆర్‌నే."-బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ