తెలంగాణ

telangana

ETV Bharat / politics

మోదీ అరెస్టు చేయించాలని కుట్ర పన్నారంటూ కేసీఆర్ కొత్త డ్రామా : బండి సంజయ్ - BANDI SANJAY SLAMS KCR COMMENTS

Bandi Sanjay Reacts To KCR Comments : ప్రధాని నరేంద్ర మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్పందించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, దాన్ని తమ ప్రభుత్వం సహించదని బదులిచ్చారు. కాంగ్రెస్‌, గులాబీ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసుగా ఉన్నాయని కరీంనగర్​లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.

Bandi Sanjay Comments on BRS
Bandi Sanjay React on KCR Comments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 1:40 PM IST

మోదీ అరెస్టు చేయించాలని కుట్ర పన్నారంటూ కేసీఆర్ కొత్త డ్రామా : బండి సంజయ్ (ETV Bharat)

Bandi Sanjay Reaction On KCR Comments: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​ అన్నారు. కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీలు రెండు నాణేనికి బొమ్మ, బొరుసుగా ఉన్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Bandi Sanjay Fire on Congress :ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్‌ చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ ఇప్పటివరకు చేసిన అవినీతి, అక్రమాలు చాలని, ఇకనైనా ప్రజలకు సేవ చేయండని సూచించారు. అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ పార్టీలు రెండూ ఒకటేనని, అది నిజం కాకపోతే అవినీతిపై సీబీఐకి లేఖ రాయాలని అన్నారు. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు తాను సిద్ధమని మీరు సిద్ధమా అంటూ బీఆర్ఎస్, హస్తం నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారు.

రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకున్న బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు బుద్ధి చెప్పాలి : బండి సంజయ్ - Bandi Sanjay Election campaign

"కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్‌ చెప్పాలి. కాంగ్రెస్‌ ఇప్పటివరకు చేసిన అవినీతి, అక్రమాలు చాలు. కరీంనగర్​లో కాంగ్రెస్​ మూడో స్థానం పోతుందని భావించి అడ్డగోలుగా ఖర్చు పెడుతోంది. కేసీఆర్ అవినీతి కుటుంబం అందుకే వాళ్లు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి సీబీఐ రాకుండా చేశారు. తనకేం తెలియదని కేసీఆర్ అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇక్కడి డబ్బులు విదేశాల్లో, దిల్లీ మద్యంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా చేస్తే ప్రజలు కేసీఆర్​ను​ ఎలా నమ్ముతారు." - బండి సంజయ్, కరీంనగ్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి

Bandi Sanjay Comments on BRS: బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ ప్రస్తుతం కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇక్కడి డబ్బులు విదేశాల్లో, దిల్లీ మద్యంలో పెట్టుబడులు పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు బాధితులమే : బండి సంజయ్‌ - BANDI SANJAY PHONE TAPPING CASE

హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా - కాంగ్రెస్​కు బండి సంజయ్​ సవాల్ - Bandi Sanjay Challenge to Congress

ABOUT THE AUTHOR

...view details