ETV Bharat / state

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ తేదీలు ఖరారు - వారికి మాత్రం ఫ్రీ ఎంట్రీ - 37TH HYDERABAD BOOK FAIR 2024

పుస్తక పండుగకు వేళాయే - నగరవాసులను మరో మారు పలకరించనున్న బుక్​ ఫెయిర్​ - డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శన

Hyderabad Book Fair 2024
37th Hyderabad Book Fair 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 10:26 PM IST

37th Hyderabad Book Fair 2024 : పుస్తక ప్రియులకు గుడ్​న్యూస్​. ప్రతి ఏటా విలువైన జ్ఞానాన్ని అందించి, తనదైన లోకంలో అనుభూతులను పంచే పుస్తక ప్రదర్శనశాల త్వరలోనే నగరవాసులను మరోమారు పలకరించనుంది. ప్రతి ఏడాది హైదరాబాద్‌లో నేషనల్​ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ 37వ ఎడిషన్‌తో ఈ ఏడాది కూడా మీ ముందుకొచ్చింది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్టు బుక్ ఫెయిర్ సొసైటీ ప్రకటించింది. ఈ మేరకు సోమాజీగూడలోని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, బుక్ ఫెయిర్ సలహాదారు ఆచార్య రమా మెల్కొటె సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ మేరకు కార్యక్రమంలో బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్‌ మాట్లాడుతూ.. ఈసారి నిర్వహించే పుస్తక ప్రదర్శనకు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం, సీనియర్​ ఎడిటర్​ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్​ రమా మెల్కొటే గౌరవ సలహాదారులుగా ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ సలహాదారులతో పాటు కమిటీ సభ్యులు బుక్​ ఫెయిర్​కు సంబంధించిన లోగోని ఆవిష్కరించారు. మొత్తంగా 300 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం త్వరలోనే లాటరీ విధానం నిర్వహించనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. పుస్తక సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Hyderabad Book Fair 2024
పుస్తక ప్రదర్శనకు సంబంధించిన లోగో ఆవిష్కరణ (ETV Bharat)

ఐడీ కార్డులతో ఉచిత ప్రవేశం : ప్లాస్టిక్​ నిషేధాన్ని పాటిస్తూ.. సందర్శకుల కోసం టికెట్లతో పాటు బుక్స్​ కోసం ‘సంచి’ని ఇస్తామని బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు యాకూబ్‌ తెలిపారు. రచయితలు, పబ్లిషర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు తమ ఐడీ కార్డులతో ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9490099081ను సంప్రదించవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కోదండరాం.. పుస్తక ప్రదర్శన నగరవాసులకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుక్​ ఫెయిర్​ సెక్రటరీ వాసు, కోశాధికారి నారాయణ రెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు కె.బాల్​ రెడ్డి, శోభన్​ బాబు, జాయింట్​ సెక్రటరీలు కె.సురేశ్​, ఎం. సూరిబాబు, ఈసీ సభ్యులు జనార్దన్‌ గుప్తా, విజయారావు, మధుకర్​, కోటేశ్వర రావు, శ్రీకాంత్​, శ్రీనివాసరావు, సాంబశివరావు, స్వరాజ్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

హాఁ - బుక్ పట్టగానే నిద్ర ముంచుకొస్తుందా? - ఈ టిప్స్ పాటిస్తే యాక్టివ్​గా ఉంటారు!

ఎల్​కేజీ టు ఐఏఎస్ - ఏ పుస్తకం కావాలన్నా కేరాఫ్ అడ్రస్ - 'కోఠి బుక్ మార్కెట్' - Koti Book Market in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.