ETV Bharat / state

ఒకరి నిర్లక్ష్యం ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం - స్కూల్​ గేటు పడి ఒకటో తరగతి విద్యార్థి మృతి - STUDENT DIED DUE TO SCHOOL GATE

హయత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి మృతి - స్కూల్‌ గేటు విరిగి పడి చనిపోయిన ఒకటో తరగతి బాలుడు

STUDENT DIED AFTER GATE COLLAPSE
Student Sied after School Gate Collapse in Hayathnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 10:25 PM IST

Student Sied after School Gate Collapse in Hayathnagar : చావు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మన నిర్లక్ష్యం, పొరపాటే మనపాలిట శాపంగా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరో చేసిన పొరపాటు, నిర్లక్ష్యానికి ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండేలా చేసింది. ఉదయం ముద్దుముద్దు మాటలతో తన కుమారుడు చేసిన వీడ్కోలే తమకు చివరివని ఆ తల్లికి అప్పుడు తెలియదు. సాయంత్రం కుమారుడు ఇంటికి వస్తాడని ఎదురుచూసే సమయంలో వచ్చిన పిడుగులాంటి వార్త ఆ మాతృమూర్తిని గుండెను ఆపేసినంత పని చేసింది. తన ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలిసి ఆ కన్నతల్లి హృదయం ఎంతగా ద్రవించిపోయందో. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి బలైనా ఓ ప్రభుత్వ స్కూల్ చిన్నారి విషాద గాథ ఇది.

Student Sied after School Gate Collapse in Hayathnagar
చనిపోయిన విద్యార్థి అజయ్ పాత చిత్రం (ETV Bharat)

పాఠశాల గేటు విరిగి మీద పడడంతో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి అజయ్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్​లోని జిల్లా పరిషత్ హై స్కూల్​లో ఇవాళ సాయంత్రం జరిగింది. సాయంత్రం పాఠశాలలో తోటి పిల్లలతో అజయ్ ఆడుకుంటున్నాడు. కొంతమంది పిల్లలు గేటు ఎక్కి అటూ ఇటూ ఊగుతూ ఆడుకుంటున్నారు. గేటు వెల్డింగ్ జాయింట్లు బలహీనంగా ఉండడంతో విరిగి అక్కడే ఆడుకుంటున్న అజయ్​ మీద పడింది. గేటు మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆ తల్లిదండ్రలకు ఒక్కగానొక్క సంతానం : అక్కడ చికిత్స పొందుతూ అజయ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న హయత్​నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అజయ్ తండ్రి అలకంటి చెందు కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా హయత్ నగర్​లో ఉంటూ చెత్త ఎత్తే బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల అజయ్​ ఒక్కడే సంతానం. తమకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుడి చావుకు పాఠశాల యాజమాన్యం కారణమంటూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఐదో అంతస్థు నుంచి కింద పడి ప్రైవేట్ కాలేజీ విద్యార్థి మృతి - పోలీసుల విచారణలో ఏం తేలిందంటే !

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి - అనుమానాస్పద స్థితిలో సిద్దిపేట యువకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.