Bandi Sanjay on MLC Kavitha : సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర విచారణ సంస్థలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎపీ బండి సంజయ్ అన్నారు. సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకు కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
Bandi Sanjay Comments on Congress :కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay)ఆరోపించారు. గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసిన చరిత్ర వారిదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆక్షేపించారు. గత ఎన్నికల్లోనూ ఇలాగే ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారని ధ్వజమెత్తారు. వారం రోజుల్లో లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. గులాబీ పార్టీతో తమకు పొత్తు అనేదే ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితం కాబోతోందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి : బండి సంజయ్
Bandi Sanjay Fires on BRS :కరీంనగర్ నియోజకవర్గానికి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల కొరత ఏర్పడితే కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని బండి సంజయ్ వెల్లడించారు.