ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఇవే నాకు చివరి ఎన్నికలు - దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుంది: బాలినేని

Balineni Srinivasa Reddy Comments: చెప్పిన మాట ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలు అని తెలిపారు.

Balineni_Srinivasa_Reddy_Comments
Balineni_Srinivasa_Reddy_Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 10:35 PM IST

Updated : Jan 23, 2024, 11:01 PM IST

Balineni Srinivasa Reddy Comments: తనకు ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేయడానికి బాలినేని కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఒంగోలు వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చర్చి సెంటర్​లో జరిగిన సభలో బాలినేని మాట్లాడారు.

ఒంగోలులో ఇళ్ల పట్టాల ఇస్తేనే పోటీ చేస్తానని గతంలో పేర్కొన్నానని, చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రితో మాట్లాడి 230 కోట్ల రూపాయలు విడుదల చేయించానని , వచ్చే నెల 10వ తేదీలోపు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి చేతులు మీదుగా పంపిణీ చేస్తామన్నారు. ఈ సారి తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నానని అంటూ, తనకు ఇవే చివరి ఎన్నికలు అని పేర్కొన్నారు.

రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం - అధిష్ఠానం ఎత్తులకు ఆశావహుల ప్రతివ్యూహం

చెప్పిన మాట ప్రకారం పట్టాలు పంపిణీ చేస్తామని, అందరికీ జగనన్న కాలనీ నిర్మిస్తామన్నారు. ఒంగోలులో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి, పూరిళ్లు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయం ప్రస్తావిస్తూ దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని అన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

పట్టాలు పంపిణీ చేసేందుకు 230 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి జగన్​కు ఈ సందర్భంగా బాలినేని ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా, ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ఎవరికైతే ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యాయో వారికి ప్రతి డివిజన్​కు వచ్చి ఇస్తానని బాలినేని చెప్పారు.

వైసీపీలో చర్చాంశనీయంగా బాలినేని- సీఎం జగన్ తీరుపై అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి

కాగా కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ అపాయింట్​మెంట్ కోసం 3 రోజుల పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి వేచి చూశారు. అయినా సరే జగన్ అపాయింట్‌మెంట్‌ దక్కకపోవడంతో బాలినేని హైదరాబాద్​కు వెళ్లిపోయారు. అనంతరం సీఎం జగన్ బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. ఒంగోలులో పోటీ చేయడంపై బాలినేని స్పందనను అడిగి తెలుసుకున్నారు.

దీనిపై స్పందించిన బాలినేని ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి సంబంధించిన సొమ్మును విడుదల చేస్తామంటేనే పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. దీంతో సీఎం జగన్ ఆ డబ్బులను విడుదల చేసేందుకు హామీ ఇచ్చారు. సీఎం జగన్​ నుంచి హామీ రావడంతో బాలినేని మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ చెప్పుకొచ్చారు. తరువాత ఎన్నికలకు తన కుమారుడు పోటీ చేస్తాడని తెలిపారు.

"ఆ డబ్బు ఇస్తే ఒంగోలులో చేస్తావు, లేదంటే గిద్దలూరుకు వెళ్తావు కదా!" బాలినేని, సీఎంల మధ్య మాటా మంతీ

Last Updated : Jan 23, 2024, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details