Bachina Krishna Chaitanya Granite Quarry: నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్యను తొలగించి ఆయన స్థానంలో పాణెం హనిమిరెడ్డిని సమన్వయకర్తగా ఇటీవలే జగన్ నియమించారు. దీనిపై కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అద్దంకిలో తానే పోటీచేస్తానని అనుచరులకు చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కృష్ణ చైతన్యను సీఎంవోకు పిలిచింది! ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించింది. అయినా హనిమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు కృష్ణచైతన్య విముఖత చూపారు.
అయినా పాణెం హనిమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు ఆయన విముఖత చూపారు. నియోజకవర్గంలో మళ్లీ సర్వే చేయించి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే సీటు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరారు. అయితే సమన్వయకర్తతో కలసి పనిచేయాల్సిందేనని వైసీపీ పెద్దలు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తనకు సీటు వచ్చే అవకాశం లేదని భావించిన కృష్ణచైతన్య పార్టీ మారే యోచనలో ఉన్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
ఏపీలో మరోసారి బయటపడ్డ ఫ్యాక్షన్ రాజకీయం - పార్టీ మారలేదని కక్షగట్టిన వై'ఛీ'పీ
ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా మల్లాయపాలెంలో కృష్ణచైతన్యకు చెందిన ఆర్ణ స్టోన్స్ గ్రానైట్ క్వారీలో, బుధవారం బాపట్ల జిల్లా మైనింగ్ ఆర్‌ఐ రాజు సిబ్బందితో కలిసి తనీఖీలు చేశారు. క్వారీలో ఎంత పరిమాణంలో రాళ్లు తీసేందుకు భూగర్భగనులశాఖ నుంచి అనుమతి తీసుకున్నారన్న విషయాలు పరిశీలించారు. క్వారీలో ఎంత వెడల్పు, పొడవు, లోతు వరకు తవ్వకాలు చేశారని కొలతలు సేకరించారు.