హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ను ప్రజలు ఇంటికిపంపాలి: షర్మిల APCC YS Sharmila Election Campaign in Kadapa:రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ని ఓడించాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. కుంభకర్ణుడు ఆరు నెలలపాటు నిద్రపోతే జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయారని ధ్వజమెత్తారు. వివేకాని హత్య చేయించిన అవినాష్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని కడపవాసులను షర్మిల విజ్ఞప్తి చేశారు.
న్యాయ బస్సు యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిల మూడోరోజు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. సీకే దిన్నె, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు మండలాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. వివేకా కుమార్తె సునీత ఆమె వెంట ప్రచారంలో పాల్గొన్నారు.
మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై పంచ్‌లు- హత్య రాజకీయాలు చేస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లంటూ ఎద్దేవా - Sharmila allegations on MLA and MP
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని షర్మిల విమర్శించారు. అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చెబుతున్నా అధికార అహకారంతో శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలు చేస్తున్న ఇలాంటి నాయకులకు వైసీపీ మళ్లీ టికెట్ ఎలా ఇస్తుందని షర్మిల నిలదీశారు.
అంతేకాకుండా వివేకా హత్యానంతరం ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యాలను తుడిచేస్తుంటే అవినాష్ చూస్తూ నిల్చున్నారని తన మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తుంటే చూస్తూ నిలబడటానికి ఆయనేమైనా పాలుతాగే బిడ్డా అని విమర్శించారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడానికి సిగ్గు లేదా? అని నిలదీశారు.
వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ బిడ్డను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ విరుచుకుపడ్డారు. నోరు ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కడప ఎంపీగా షర్మిలను గెలిపించుకునేందుకు వివేకా కుమార్తె సునీత పలువురి మద్దతు కూడగడుతున్నారు.
కుటుంబానికి చెందిన శివప్రకాశ్‌రెడ్డిని వెంటపెట్టుకుని వేంపల్లెలో వైసీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరారు. ఇటీవల తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, వైసీపీ జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతోపాటు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan