Jagan ignored Suggestions on SECI Agreement : సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఇంధన, ఆర్థిక శాఖలతో పాటు APGECL, RLDC వంటి విభాగాల సీనియర్ IAS అధికారులు, నిపుణులు దీనిపై ఎన్నో అభ్యంతరాలు వెలిబుచ్చారు. రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ఒప్పందాన్ని పరిశీలించాలని సూచించారు. వాటన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేసింది. అధికారులు, నిపుణుల అభ్యంతరాలు, సూచనలపై సెకితో సంప్రదింపులు జరిపి నివేదిక ఇచ్చే బాధ్యతను APPCCకి అప్పగించింది. అయితే అధికారులు, నిపుణుల అభ్యంతరాలు, సూచనల్లో ఒకటి రెండు మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఆ కమిటీ తూతూ మంత్రంగా నివేదిక ఇచ్చింది.
సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై మొదటి నుంచి అన్ని అభ్యంతరాలే. ఒప్పందంపై ఆయా విభాగాలు, అధికారులు చేసిన పలు కీలకమైన సూచనల్ని జగన్ సర్కార్ పట్టించుకోలేదు. వాటిని పక్కనపెట్టి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఏపీజీఈసీఎల్ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు బదులు సెకి నుంచి 7 వేల మెగావాట్లు తీసుకోవడమే ఆర్థికంగా లాభదాయకమని 2021 అక్టోబరు 25న ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. జగన్ ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో చక్రం తిప్పిన ఒక అదృశ్యశక్తి కమిటీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ నివేదిక ఇప్పించారు. దాని ప్రకారమే సెకి నుంచి 7 వేల మెగావాట్ విద్యుత్ కొనడమే లాభదాయకమని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2021 అక్టోబరు 28న మరోసారి మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించింది. సెకితో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని ఈ సందర్భంగా డిస్కంలను ఆదేశించింది.
నిబంధనలకు పాతర - అదానీ సంస్థతో విద్యుత్ ఒప్పందాలు
ఈ సందర్భంగా ఆయా విభాగాలు, అధికారులు చేసిన పలు కీలకమైన సూచనలు, వాటిని జగన్ సర్కార్ పట్టించుకోని వైనాన్ని ఓ సారి పరిశీలిద్దాం. యూనిట్ విద్యుత్ రూ.2.49కి సరఫరా చేస్తామని ప్రతిపాదించినా, అంతర్రాష్ట్ర సరఫరా- ఐఎస్‌టీఎస్ నష్టాల రూపంలో అదనపు భారం పడుతుందని దాని నుంచి మినహాయింపు ఉండేలా చూడాలని ఏపీజీఈసీఎల్ సూచించింది. సెకితో ఒప్పందంలో భాగంగా 2025, 2026 సెప్టెంబరు నెలల్లో ఉత్పత్తి మొదలయ్యే ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికి పిలిచే ఇతర టెండర్లలో ఏ టారిఫ్‌లు ఖరారైతే వాటినే మన రాష్ట్రానికీ వర్తింపజేసేలా సంప్రదింపులు జరపాలని చెప్పింది. మన రాష్ట్రంలోనే విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సెకిని డిస్కంలు కోరాలని నివేదించింది. అయితే వీటిలో ఏ సూచనల్నీ జగన్ సర్కార్ పరిగణనలోకి తీసుకోలేదు.
అన్ని ఛార్జీలూ కలిపి యూనిట్ ధర రూ.2.49కి మించకూడదని ఇంధనశాఖ అప్పటి కార్యదర్శి శ్రీకాంత్ సూచించారు. సెకి ప్రతిపాదించిన యూనిట్ ధరలోనే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సెకి ట్రేడ్ మార్జిన్ వంటివి కలిసే ఉండాలని ఏపీజీఈసీఎల్ టెండర్లలో వచ్చిన ధరకు అది మించకూడదని తెలిపారు. అలాగే సెకి నుంచి మొత్తం మూడు విడతల్లో తీసుకునే విద్యుత్‌కు, పాతికేళ్లపాటు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు మినహాయించాలని సూచించింది. అదేవిధంగా సెకి 9 వేల మెగావాట్ల విద్యుత్ కొన్సాలిందిగా ప్రతిపాదించినా డిస్కంలతో సంప్రదించి ఎంత అవసరమో అంతే కొనాలని తెలిపింది. మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపిన యూనిట్‌కు రూ.2.49కి మించకూడదని చెప్పిన శ్రీకాంత్, ఏపీపీసీసీ ఛైర్మన్ హోదాలో ఆ విషయాల్ని పూర్తిగా విస్మరించారు. ఈ సందర్భంగా సెకితో ఒప్పందాన్ని సమర్థిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతి యూనిట్‌కు రూ.2.49 టారిఫ్‌తో పాటు మరో రూ.1.70 చొప్పున నెట్‌వర్క్ ఛార్జీలూ పడతాయని వెల్లడించారు. దీన్నిబట్టి అక్కడే యూనిట్ రూ.4.19 అవుతుందని స్పష్టం అవుతుంది. ఇంకా కనిపించని ఛార్జీలు చాలా ఉన్నాయి.
జగన్‌ను ఆస్కార్‌కు నామినేట్ చేసిన షర్మిల - బైబిల్‌పై ప్రమాణం చేయాలని సవాల్
నాలుగు ట్రాంచ్‌ల్లో సెకి పిలిచిన వివిధ టెండర్లను రాష్ట్ర విద్యుత్ శాఖ పరిశీలించాలని అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్ సూచించారు. సెకి ఇదివరకే ఖరారు చేసిన, అలాగే భవిష్యత్తులో ఖాయం చేయనున్న వివిధ టెండర్లలో యూనిట్ విద్యుత్ ధర రూ.2.49 కంటే తక్కువ ఉందేమో చూడాలన్నారు. తక్కువ ఉంటే ఆ టారిఫ్‌కే సెకితో ఒప్పందం చేసుకోవాలని వెల్లడించారు. సెకి నుంచి అంత భారీ మొత్తంలో ‘అన్‌స్టేబుల్’ విద్యుత్ కొనే ముందు మనకు అంత డిమాండ్ ఉందో లేదో క్షుణ్నంగా అధ్యయనం చేయాలన్నారు. అంత ఎక్కువ విద్యుత్‌ను 2026 నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానించగలమో లేదో చూడాలని దీనిపై విద్యుత్ శాఖ సంతృప్తి చెందితేనే ముందుకెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ఏదైనా ట్రాంచ్‌లోని ప్రాజెక్టులు ఆలస్యమై, అలాగే తరువాత ట్రాంచ్‌ల్లోని ప్రాజెక్టులు ముందుగా మొదలైతే అప్పటి ధరలు, ముందు నిర్ణయించిన ట్రాంచ్‌లో కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ ధరల్నే ఖరారు చేయాలని వివరంగా చెప్పారు. అన్ని పన్నులు, సుంకాలు కలిపి యూనిట్ ధర రూ.2.49 మించకూడదని విద్యుత్ షెడ్యూలింగ్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆర్థికశాఖ సూచనల్లో ఏ ఒక్కటీ ఏపీపీసీసీ పట్టించుకోలేదు. 2021 జనవరి నుంచి మార్చి మధ్య సెకి పిలిచిన వివిధ టెండర్లలో యూనిట్ ధర రూ.2 కి, అలాగే రూ.2.01కి సరఫరా చేసేలా ఒప్పందాలు ఖరారయ్యాయి. ఆర్థికశాఖ సూచనల ప్రకారం సెకిని ఒప్పించి ఉంటే ఇంకా తక్కువ ధరకు రాష్ట్రానికి విద్యుత్ వచ్చేది.
కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సిందే!
ఐఎస్‌టీఎస్ ఛార్జీల మినహాయింపు పేరిట కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని తెలుస్తోందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ పేర్కొంది. అంతర్రాష్ట్ర సరఫరా నష్టాలను కేంద్రం భరించే విషయాన్ని ఒప్పందంలో ప్రస్తావించలేదని చెప్పింది. 2025, 2026లో సెకి సరఫరా చేసే విద్యుత్‌కు ఛార్జీల్ని అప్పుడు సెకి నిర్వహించిన టెండర్ల ఆధారంగా గుర్తించిన మేరకు టారిఫ్ నిర్ణయించాలని సూచించింది. కానీ ఐఎస్‌టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని చెప్పడమే తప్ప, అది పూర్తి మినహాయింపా, కొంత రాయితీ మాత్రమేనా అన్న స్పష్టత ఒప్పందంలో లేదు. విద్యుత్‌రంగ నిపుణులు మాత్రం ఐఎస్‌టీఎస్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లేదని చెబుతున్నారు. సెకి విద్యుత్‌కి ఒక్కో మెగావాట్‌కు ఏడాదికి 52 లక్షల చొప్పున ఐఎస్‌టీఎస్ ఛార్జీల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
సెకితో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి ఏపీపీసీసీ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనలను చూద్దాం. ఏపీజీఈసీఎల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవడం కంటే సెకి నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ తీసుకోవడం లాభదాయకం. బీసీడీ, సేఫ్‌గార్డ్ డ్యూటీ- ఎస్‌జీడీ, జీఎస్టీ నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా పడే భారాల్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుందని చెప్పింది. వాటితో సంబంధం లేకుండా యూనిట్‌కు 2.49 చొప్పున టారిఫ్ నిర్ణయిస్తే సెకి ప్రతిపాదన ఆమోదించవచ్చని సూచించింది. 25 ఏళ్ల కాలానికి ఐఎస్‌టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుందని ఐఎస్‌టీఎస్ నష్టాలు 3 శాతం రాష్ట్రం భరించాలని పేర్కొంది.
సెకితో సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందం - అధిక ధర ఎందుకంటే - అడ్డగోలు వాదన
సెకి ఇప్పటి వరకు నిర్వహించిన బిడ్‌లలో యూనిట్ రూ.2.49 కంటే తక్కువ టారిఫ్ లేదని ఏపీజీఈసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పోలిస్తే సెకి ఆప్షన్‌లో ఏడాదికి రూ.2 వేల కోట్లు మిగులుతుందని తెలిపింది. సెకి ప్రతిపాదించిన టారిఫ్‌పై చర్చలు జరపొచ్చని యూనిట్‌కు రూ.2.49 చొప్పున లేదా తర్వాత ట్రాంచ్‌లలో నిర్వహించే బిడ్లలో తక్కువ వచ్చే ధరలో ఏది తక్కువైతే దాన్ని వర్తింపజేయాలని కోరాలని సూచించింది. 2025 తర్వాత ఉత్పత్తి ప్రారంభమైనా కూడా సరఫరా ఛార్జీల మినహాయింపు వర్తిస్తుందని అవసరమైతే కేంద్రం గడువు పెంచుతుందని చెప్పింది. సెకి ప్రతిపాదన ప్రకారం మూడు విడతల్లో విద్యుత్ రాష్ట్రానికి అందుతుందని ఏదైనా విడతలో జాప్యం జరిగితే మరో ట్రాంచ్‌లో పూర్తి చేసిన ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ ధర తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికీ అదే ధర వర్తింపజేేసేలా సంప్రదింపులు జరపాలని పేర్కొంది.
సెకి ప్రతిపాదన రెండోసారి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటప్పుడు, క్యాబినెట్‌కు ఆర్థికశాఖ ఒక నోట్ పంపింది. సెకి నుంచి తీసుకునే విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో కూడా అన్ని సుంకాలు, పన్నులు కలిపి రూ.2.49కి మించరాదని సెకి నుంచి 2024 సెప్టెంబరులో సరఫరా మొదలవుతుందని తెలిపింది. 2021లో నిర్దేశించిన టారిఫ్ ప్రకారం 2024లో విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని సాంకేతికత అభివృద్ధి చెందుతుండటంతో సౌర విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని పేర్కొంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిటీ -సీఈఆర్‌సీ నిబంధనలను నిశితంగా పరిశీలించి ఐఎస్‌టీఎస్ ఛార్జీల మాఫీ ఒప్పంద వ్యవధి మొత్తానికి వర్తిస్తుందా? లేదా అనేది పరిశీలించాలంది. సందేహాలుంటే సీఈఆర్‌సీ, సెకి నుంచి వివరణ తీసుకోవాలని సూచించింది.
అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారు : బాలినేని
ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినా కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సెకి ట్రేడ్ మార్జిన్, ఇతర ఖర్చులు మొత్తం కలిపినా సెకి సరఫరా చేసే విద్యుత్ ధర ఏపీజీఈసీఎల్ టెండర్లలో ఖరారు చేసిన ధర కంటే మించకూడదని పేర్కొంది. మూడు ట్రాంచ్‌లలో ఏర్పాటు చేసిన ప్లాంట్లకు 25 ఏళ్లపాటు ఐఎస్‌టీఎస్ మినహాయింపు ఉండాలని చెప్పింది. జగన్ ప్రభుత్వం వీటన్నింటినీ బేఖాతరు చేసింది. సెకి నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనను 2021 అక్టోబరు 28న రెండోసారి మంత్రివర్గం ముందు పెట్టారు. 2021 సెప్టెంబరు 16న జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సెకితో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి మరోసారి డిస్కంలను ఆదేశిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీపీసీసీ నివేదికలోని సిఫారసుల్ని ఆమోదించింది. యూనిట్ రూ.2.49 చొప్పున 7000 మెగావాట్ల విద్యుత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతులిచ్చింది. ఏపీజీఈసీఎల్ ద్వారా రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్వహించిన టెండరు ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. ఏపీపీసీసీకి ఛైర్మన్‌గా అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యవహరించగా, మూడు డిస్కంల సీఎండీలు, ట్రాన్స్‌కో ఫైనాన్స్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై వారంతా సంతకాలు చేశారు.
SECI NEWS: యూనిట్ విద్యుత్ రూ.2.49కి కొనేందుకు నిర్ణయం.. ఏడాదికి రూ.850 కోట్ల భారం
కమిటీ సభ్యుల్ని ఓసారి పరిశీలిస్తే ఎస్‌పీడీసీఎల్ అప్పటి సీఎండీ సంతోషరావుపై గతంలో అనేక ఆరోపణలున్నాయి. జగన్ అస్మదీయ కంపెనీగా ముద్రపడిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి సిఫారసుతో నియమితులైన ఆయన ఇప్పటికీ సీఎండీగా కొనసాగుతున్నారు. సీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్‌రెడ్డి మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రెండో నిందితుడైన శివశంకర్‌రెడ్డికి స్వయానా వియ్యంకుడు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 2019 డిసెంబరులో ఆయన కోసం ఎస్‌పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలను వేరు చేసి సీపీడీసీఎల్ పేరిట కొత్త డిస్కం ఏర్పాటు చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజకు విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా నివేదికపై సంతకం పెట్టారు. సెకి ఒప్పందం వల్ల అదనపు భారాలు పడతాయని తెలిసి కూడా ఒప్పందంపై ముందుకెళ్లేలా ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ క్యాబినెట్‌కు నోట్ పంపారు.
SECI: సెకి ఒప్పందం.. ప్రజలకు భారం..! దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మారిన మాట