Sankranti Holidays in Andhra Pradesh 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్. పిల్లలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ సెలవులు రానే వచ్చాయి. గాలిపటాలు, రంగు రంగుల ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలతో ఆహ్లాదంగా గడపేందుకు పది రోజులు హాలీడేస్ వచ్చాయి.
రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అకడమిక్ క్యాలండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవులనే అమలు చేయనున్నారు. క్రిస్టియన్ బడులకు మాత్రం 11 నుంచి 15 వరకు ఉంటాయి. ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు.
ముందుగానే సంక్రాంతి శోభ - హరిదాసుల కీర్తనలు - రంగురంగుల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు - హరిదాసుల కీర్తనలు - మొదలైన సంక్రాంతి సందడి