Dhone-Somayajulapalli National Highway Works : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు అధ్వాన స్థితికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రజలు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్న ఘటనలే కనిపిస్తున్నాయి. రహదాలు సరిగ్గా లేక జరిగిన ప్రమాదాలు అనేకం. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్కడి ప్రయాణికులకు నిత్యం నరకం తప్పటం లేదు. రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉండగా నేటికి ఆ పనులు పూర్తికాక వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నత్తనడకన సాగుతున్న డోన్-సోమయాజులపల్లె జాతీయ రహదారి పనులపై కథనం.
చిన్న మల్కాపురం నుంచి డోన్ వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!
'హైవే నిర్మాణం జరుగుతుందని చాలా సంతోషపడ్డాం. కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దుమ్ము, ధూళి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి పూట ఈ దారిగుండా పోవాలటే భయపడుతున్నాం. మల్కాపురం నుంచి డోన్ వరకు మరీ సమస్యాత్మకంగా ఉంటుంది. భూ సేకరణ, పెండింగ్ పరిహారాలు అందించి కూటమి ప్రభుత్వం దీన్ని త్వరగా పూర్తి చెయ్యాలని కోరుతున్నాం.' -స్థానికులు
అక్కడక్కడా మిగిలి ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తయ్యేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.