AP Ministers Fire on Jagan about Flood Relief :వైఎస్సార్సీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, నారాయణ విమర్శించారు. వరద సాయంపై అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సాక్షి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.
Minister Narayana:తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారని మంత్రి నారాయణ విమర్శించారు. రూ.602 కోట్లు పరిహరం ఇస్తే, రూ.5 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజల మధ్యలోనే ఉన్నారని అన్నారు. కాని జగన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని మండిపడ్డారు. తాగు నీరుకే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాటర్ సప్లై చేశామని మంత్రి అన్నారు. జగన్ ఇలాగే మాట్లాడుతూ పోతే 11 సీట్లు కూడా పోయి సున్నానే మిగులుతుందని అన్నారు.
Home Minister Anita:వరద సాయంపై చర్చించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్సీపీ నేతలు చర్చకు రావాలని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. ఎన్టీఆర్ జిల్లాలో టీఆర్ పద్దు కింద రూ.92 కోట్లు మాత్రమే ఆహారం కోసం ఖర్చు చేశామని అన్నారు. వరద సాయం కింద విడుదల చేసిందే రూ.139 కోట్లన్న మంత్రి అంతకు మించి అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్‌ది అంతా ఫేక్ బతుకని 11 సీట్లు వచ్చేసరికి మతి పోయినట్టుందని విమర్శించారు. తాను చేసే అవినీతే అందరూ చేస్తారనే భ్రమలో జగన్ ఉన్నారని అన్నారు. రంగులకు, సర్వే రాళ్లకు, ఎగ్ పఫ్‌ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్లా తమ ప్రభుత్వం గురించి మాట్లాడేదని మంత్రి అనిత విమర్శించారు.
పునరావాసమా? అరణ్యవాసమా? - పోలవరం నిర్వాసితులకు జగన్ శాపం - కూటమి ప్రభుత్వం కన్నీళ్లు తుడిచేనా!