తెలంగాణ

telangana

ETV Bharat / politics

'ఒకప్పుడు హీరో అడవులను కాపాడే వాడు - కానీ ఇప్పుడు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడు' - PAWAN KALYAN COMMENTS ON MOVIES - PAWAN KALYAN COMMENTS ON MOVIES

Pawan Kalyan Sensational comments : జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం '40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడు' అంటూ పేర్కొన్నారు.

Pawan Kalyan comments
Pawan Kalyan Sensational comments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 4:25 PM IST

Updated : Aug 8, 2024, 5:26 PM IST

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్​ కోరారు.

పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని పవన్ తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని, అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్​ వెళ్లిన పవన్​కల్యాణ్​ - ఎందుకంటే?

ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్​ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడువులను సంరక్షించేవాడని, కానీ ఇప్పుడు ఆ అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్​ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ఓ స్టార్​ హీరో సినిమాని ఉద్దేశించే పవన్​ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి. - బెంగళూరులో పవన్ కల్యాణ్ కామెంట్స్

త్వరలోనే కెమెరా ముందుకు : ఇక సినిమాల విషయానికి వస్తే, ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీబిజీగా గడుపుతున్న పవన్​ కల్యాణ్,​ త్వరలోనే కొంత సమయం తీసుకుని చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్​ భగత్​సింగ్​ మూవీల షూటింగ్​ దాదాపు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా వాటిని కంప్లీట్​ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో డైరెక్టర్​ హరీశ్ శంకర్​ సైతం కన్ఫార్మ్​ చేశారు. పవన్​ కల్యాణ్ సినిమాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారని, త్వరలోనే ఉస్తాద్​ భగత్​సింగ్ మిగిలిన షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

పవన్ కల్యాణ్ అద్భుతాలు సృష్టిస్తారు - నాకు ఆ నమ్మకం ఉంది : శ్రియ శరన్

PK ఫ్యాన్స్ గెట్​రెడీ- 'OG' నుంచి స్పెషల్ వీడియో- ఎప్పుడంటే? - Pawan Kalyan OG

Last Updated : Aug 8, 2024, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details