ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

రాష్ట్రం నుంచి నేరగాళ్లు, మాఫియాను తరిమికొట్టేందుకే కూటమిగా జతకట్టాం: అమిత్ షా - Alliance Campaign Meeting - ALLIANCE CAMPAIGN MEETING

Amit Shah Speech at Dharmavaram Alliance Campaign Meeting: ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేరగాళ్లు, మాఫియాను తరిమికొట్టేందుకే బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టుకట్టాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. రాష్ట్రంలో జగన్‌ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని పోలవరం రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

alliance_campaign_meeting
alliance_campaign_meeting (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 8:02 PM IST

Amit Shah Speech at Dharmavaram Alliance Campaign Meeting:కూటమికి అధికారమిస్తే పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన కూటమి ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అభ్యర్థులు పాల్గొన్నారు. జగన్‌ పాలన వైఫల్యాలను ఎండగట్టిన అమిత్‌ షా రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ జీవో ఎందుకు ఇచ్చారు- సజ్జలకు పవన్ కల్యాణ్ సూటిప్రశ్న - Pawan Kalyan Election Campaign

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, నేరాలు, మాఫియాను అరికట్టడానికి బీజేపీ, జనసేన, తెదేపా కూటమిగా ఏర్పడ్డాయ అమిత్‌ షా అన్నారు. ఏపీ నుంచి గూండాగిరిని, నేరగాళ్లను తరిమేందుకు జట్టు కట్టామని తెలిపారు. భూ మాఫియాను అంతం చేసేందుకు కలిసి వస్తున్నామని రాజధాని అమరావతిని తిరిగి నిర్మించేందుకు కూటమిగా కలిశామని అన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను పునఃప్రతిష్ఠాపించేందుకు ఏకమయ్యామని తెలుగు భాషను పరిరక్షించేందుకు ఒక్కటయ్యామని తెలిపారు. తెలుగు భాషను అంతం చేసి ఆ స్థానంలో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలన్నది జగన్‌ సర్కారు కోరికని దుయ్యబట్టారు.

కాయ్‌ రాజా కాయ్‌లో తేలిపోతున్న ఫ్యాన్‌ గాలి- అధికార మార్పిడిపై వెయ్యి కోట్లు బెట్టింగ్స్‌ - Election bettings on andhra pradesh

చెవులు రెక్కించి విను జగన్‌ బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వమని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు జగన్‌ సర్కారు అవినీతి వల్ల దాదాపుగా మరుగున పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ గ్యారంటీగా చెబుతున్నా ఏపీలో చంద్రబాబును, కేంద్రంలో మోదీని గెలిపించండి రెండేళ్లలోనే పోలవరాన్ని పూర్తి చేసి పొలాలకు నీరు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ప్రగతి పథంలో పరుగెత్తిన రాష్ట్రాన్ని జగన్‌ అధోగతి పాలు చేశారని అమిత్‌షా దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థానంలో నిలిపారని తెలిపారు. విభజన తర్వాత కూడా ఇక్కడ గట్టి పునాదులు వేశారని జగన్‌ వచ్చాక రాష్ట్రాన్ని ప్రగతి పట్టాల నుంచి తప్పించారని అమిత్ షా అన్నారు.

మంచితనం, మానవత్వం లేని వ్యక్తికి ఓటేస్తే నాశనమే - అంబటి రాంబాబు అల్లుడు వీడియో వైరల్​ - SENSATIONAL COMMENTS ON AMBATI

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం పెట్టుబడుల ఊసేలేదని అమిత్ షా దుయ్యబట్టారు. నిరుద్యోగిత ఆకాశాన్నంటిందని ఏపీపై రూ.13 లక్షల కోట్ల రుణభారం మోపారని తెలిాపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోయాయి కానీ భూ కబ్జాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయని మండిపడ్డారు. మద్య నిషేధమని చెప్పి ఏకంగా మద్యం సిండికేట్‌ను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ రాయలసీమను విస్మరించారని తెలిపారు. మోదీ, చంద్రబాబును గెలిపించండి పోలవరంతో పాటు హంద్రీ-నీవా సుజల స్రవంతి, వెలిగొండ వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. చీకటి చట్టాలతో ప్రజల ఆస్తుల్ని కొట్టేయాలని జగన్‌ కుట్ర పన్నారని చంద్రబాబు ఆక్షేపించారు. అరాచక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

రాష్ట్రం నుంచి నేరగాళ్లు, మాఫియాను తరిమికొట్టేందుకే కూటమిగా జతకట్టాం (ఈటీవీ భారత్)

ABOUT THE AUTHOR

...view details