Amit Shah about Jagan palaces : జగన్ ఆస్తులు, ప్యాలెస్‌ల గురించి అమిత్‌షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జగన్ కు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్యాలెస్‌లు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని ఆరా తీసినట్లు తెలిసింది. విశాఖ రుషికొండపై కట్టిన ప్యాలెస్‌కు ఎన్జీటీ నిబంధనల ప్రకారం రూ.200 కోట్ల జరిమానా కట్టేల్సిందేనని అమిత్‌షా అభిప్రాయపడినట్లు తెలిసింది.
జగన్ ప్యాలెస్‌ల పై అమిత్ షా ఆరా : సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో అమిత్‌షా జగన్ ప్యాలెస్‌ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్‌పాండ్, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని లోకేశ్ అమిత్‌షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ బదులిచ్చారు. బెంగళూరు ప్యాలెస్ విస్తీర్ణం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 ఎకరాలకు పైనే ఉందని లోకేశ్ అందుకు బదులిచ్చారు. దానికి అన్ని ఎకరాల్లోనా? అంటూ అమిత్ షా అశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎన్జీటీ 200 కోట్ల జరిమానా వేసిందన్న లోకేశ్ : విశాఖలోనూ రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేశ్ చెప్పగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టిందే కదా? అని అమిత్ షా అన్నారు. నిక్షేపంగా ఉన్న పాత పర్యాటకశాఖ కాటేజీలను కూల్చేసి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ ప్యాలెస్లు కట్టారని లోకేశ్ వివరించారు. దానికి ఎన్జీటీ రాష్ట్రప్రభుత్వానికి 200 కోట్ల జరిమానా వేసిందని లోకేశ్ గుర్తు చేశారు. ఆ భారం ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని వివరించారు. ఆ జరిమానా కట్టేశారా? అని షా ప్రశ్నించగా ఇంకా లేదని లోకేశ్ బదులిచ్చారు.
ఎన్జీటీ జరిమానాను కట్టాల్సిందేనన్న అమిత్ షా : ఎన్జీటీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఎన్జీటీకి ఆ డబ్బు ఎప్పటికైనా కట్టాల్సిందేనని అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా? అని షా ప్రశ్నించారు. అందుకు బదులుగా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, అప్పుడప్పుడూ వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేశ్ వివరించారు.
ఎన్డీఆర్ఎఫ్ వేడుకలకు అమిత్‌షా : నేడు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకలకు అమిత్‌షాతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం ఇద్దరు నేతలు విడివిడిగా దిల్లీ వెళ్లనున్నారు. సీఎం దిల్లీ నుంచి నేరుగా దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్‌లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్
'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్‌తో అమిత్ షా ఎక్స్‌క్లూజివ్