తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఖమ్మంలో వియ్యంకుడిని గెలిపించాలంటూ సినీనటుడు వెంకటేశ్ ప్రచారం - భారీగా తరలివచ్చిన అభిమానులు - Venkatesh Election Campaign - VENKATESH ELECTION CAMPAIGN

Actor Victory Venkatesh Election Campaign in Khammam : తన వియ్యంకుడిని ఎన్నికల్లో గెలిపించాలంటూ విక్టరీ వెంకటేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి మద్దతుగా అక్కడ చేపట్టిన రోడ్​ షోలో పాల్గొన్నారు. వెంకటేశ్​ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Actor Venkatesh Election Campaign in Khammam
Actor Victory Venkatesh Election Campaign in Khammam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 7:28 PM IST

Updated : May 7, 2024, 7:44 PM IST

Actor Venkatesh Election Campaign in Khammam :ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి మద్దతుగా ప్రముఖ సినీనటుడు వెంకటేశ్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో చేపట్టిన రోడ్​ షోలో పాల్గొన్న ఆయన్ను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. తన వియ్యంకుడు, కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురాం రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ కోరారు. వెంకటేశ్ రాకతో ఖమ్మం రహదారులు కిక్కిరిసిపోయాయి.

ఖమ్మంలో వియ్యంకుడిని గెలిపించాలంటూ సినీనటుడు వెంకటేశ్ ప్రచారం భారీగా తరలివచ్చిన అభిమానులు (ETV Bharat)

Actor Venkatesh Daughter Election Campaign :ఇప్పటికేరఘురాం రెడ్డి కోడలు అయిన ఆశ్రిత (వెంకటేశ్ పెద్ద​ కుమార్తె) హస్తం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు. అపార్టుమెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు. మహిళలతో సరదాగా ఫొటోలు దిగుతూ కాంగ్రెస్​ను గెలిపించాలని కోరుతున్నారు. రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళ్తున్న ఆమె ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నారు. ఖమ్మం ప్రజలకు తమ కుటుంబం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్​ ఉందని, ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఖమ్మం నియోజకవర్గానికి మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. ఇవాళ వెంకటేశ్ కూడా రంగంలోకి దిగి తన వియ్యంకుడి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. గతంలో వెంకటేశ్ ఎప్పుడు ఇలా రాజకీయ ర్యాలీలో పాల్గోలేదు.

మామకు మద్దతుగా కోడలు - ఖమ్మం ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్​ కుమార్తె ఆశ్రిత - AASHRITHA ELECTION CAMPAIGN

మరోవైపు ఖమ్మంలో రాజకీయ పోరు రసవత్తరంగా ఉంది. ఖమ్మం టికెట్​ అభ్యర్థి కోసం కాంగ్రెస్ హైకమాండ్ భారీ కసరత్తే చేసింది. ఈ టికెట్ కోసం మంత్రి పొంగులేటి తన సోదరుడికే ఇవ్వాలని, అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్యకు ఇవ్వాలని భారీగా లాబీయింగ్ జరిపారు. చివరకు హైకమాండ్ పొంగులేటికి కూడా వియ్యంకుడైన రఘురాం రెడ్డి పేరు ఖరారు చేసింది.

రఘురాం రెడ్డి విజయం కోసం కాంగ్రెస్ నేతలు భారీగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, రఘురాం రెడ్డి కుటుంబం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే బీఆర్ఎస్​పై విమర్శలు చేస్తున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణుగోపాల్ అసహనం​ - పని చేసిన వారికే పదవులిస్తామని స్పష్టం - KC Venugopal zoom meet with Leaders

రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్ల ఫీట్ - కాపాడాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON RESERVATIONS

Last Updated : May 7, 2024, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details