తెలంగాణ

telangana

ETV Bharat / photos

కిక్కిరిసిన జనం, స్టేడియంలో సన్మానం - సొంతగడ్డపై రోహిత్​ సేనకు అపూర్వ స్వాగతం - T20 World Cup 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 7:47 AM IST

Team India Celebrations At Mumbai : ఎటు చూసిన జనసందోహం ఆనందంతో ఉబ్బతబ్బిపోతున్న క్రికెట్​ అభిమానులు. టీ20 కప్​తో తమ ప్లేయర్లను చూసిన క్షణం వారి కంట నీరు. ఇది తాజాగా జరిగిన విజయోత్సవ యాత్రలోని దృశ్యాలు. సగర్వంగా కప్​ గెలుచుకుని స్వదేశం చేరుకున్న రోహిత్​ సేనకు దక్కిన ఘన స్వాగతం. మరి ముంబయి, వాంఖడేలో టీమ్ఇండియా అభిమానుల సంబరాలు ఎలా జరిగాయంటే? (Associated Press)
కప్​ గెలుచుకుని స్వదేశానికి వచ్చిన రోహిత్​ సేన వాంఖడేలో ఎలా సంబరాలు చేసుకున్నారంటే? (Associated Press)
టీ20 ప్రపంచకప్‌ సాధించిన టీమ్​ఇండియా తాజాగా ముంబయి మెరైన్ రోడ్డులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. (Associated Press)
ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని ప్లేయర్లు రోడ్‌ షో చేశారు. (Associated Press)
నారీమన్‌ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు సుమారు గంటన్నర పాటు ఈ రోడ్‌ షో సాగింది. (Associated Press)
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ తరలివచ్చారు. (Associated Press)
ఫ్యాన్స్‌ మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేయగా, ఆటగాళ్లు ట్రోఫీతో వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. (Associated Press)
రోడ్ షో ముగిసిన తర్వాత టీమ్ఇండియా వాంఖడె స్టేడియానికి చేరుకుంది. (Associated Press)
ఈ కార్యక్రమానికీ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియంలోని స్టాండ్లన్నీ ఫ్యాన్స్‌తో కిటకిటలాడాయి. (Associated Press)
టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన రోహిత్‌ సేనను సన్మానించిన బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందజేసింది. (Associated Press)
ఆ తర్వాత అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లేయర్లు స్టేడియం మొత్తం తిరిగారు. (Associated Press)
బ్యాక్​గ్రౌండ్​లో వస్తున్న వందేమాతరం సాంగ్​ పాడూతూ స్టేడియంలోని వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. (Associated Press)
అభిమానులతో పాటు ప్లేయర్లు కూడా గొంతు కలిపారు. (Associated Press)
చివరగా, క్రికెటర్లు అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగారు. (Associated Press)
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి స్టెప్పులేయగా మిగతా క్రికెటర్లూ వారితో జతకలిశారు. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details