తెలంగాణ

telangana

ETV Bharat / photos

'నరకం నుంచి విముక్తి'- సిరియాలో జైళ్ల నుంచి వేల మంది విడుదల - SYRIA CRISIS

Syria Prisoners : సిరియాలో అసద్​ కుటుంబీకుల పాలనను వ్యతిరేకించిన వారిని జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతాలు బయటపడుతున్నాయి. తిరుగుబాటుదారులు సిరియాను తమ అధీనంలోకి తీసుకున్న తర్వాత అధ్యక్షుడు అసద్​తో పాటు ఆయన తండ్రి పాలనలో జరిగిన ఆకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన ఖైదీలు సంబరాలు చేసుకుంటున్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 11:27 AM IST

సిరియాలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు విడుదల (Associated Press)
దాదాపు10వేల మంది ఖైదీలను తిరుగుబాటుదారులు విడుదల చేశారు. (Associated Press)
జైలు నుంచి విడుదలైన ఖైదీలు సంబరాలు చేసుకుంటున్నారు. (Associated Press)
సిరియాలో అసద్ పాలన ముగిసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (Associated Press)
డమాస్కస్​లోని బషర్ బర్హౌమ్ జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు విడుదలయ్యారు. అందులో 7నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న 63 ఏళ్ల రచయిత కూడా ఉన్నారు. (AAssociated Press)
ఆయనను మరి కొద్ది రోజుల్లో ఊరితీయాల్సి ఉంది. కానీ అసద్ పాలన ముగియడం వల్ల తిరుగుబాటుదారులు ఆయనను జైలు నుంచి రిలీజ్ చేశారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. (Associated Press)
జైలులో ఉన్నన్ని రోజుల సూర్యుడిని చూడలేదని మరో ఖైదీ వాపోయాడు. దేవుడికి ధన్యవాదాలు అని, తనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడని ఆనందంలో తేలిపోయాడు. (Associated Press)
జైలు నుంచి విడుదలైన అనంతరం ఖైదీలు సంబరాలు చేసుకున్నారు. (Associated Press)
కొందరు ఖైదీలు చెప్పులు లేకుండా, మరికొందరు పొట్టిగా ఉన్న చిరిగిన దుస్తులను ధరించి కనిపించారు. (Associated Press)
సిరియా జైళ్లలోని పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు కొన్ని ఫొటోల్లో కనిపిస్తోంది. (Associated Press)
జైళ్లలో రహస్యంగా ఉరిశిక్షలు కూడా వేసేవారని ఓ ఖైదీ చెప్పుకొచ్చాడు. (Associated Press)
ప్రభుత్వానికి, అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వారిని సేద్నయా జైలులో పెట్టేవారు. (Associated Press)
తాజాగా సేద్నయా జైలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన తిరుగుబాటుదారులు అందులో జరిగిన ఆకృత్యాలకు సంబంధించిన సాక్ష్యాలను వీడియో తీసి ప్రపంచానికి చూపించారు. (Associated Press)
2011-2016 మధ్యకాలంలో 13,000 వేల మంది సిరియన్లను ఈ జైలులోనే ఉరి తీశారనే ఆరోపణలు ఉన్నాయి. (Associated Press)
ఇప్పటివరకు పదివేల మంది ఖైదీలు దేశంలోని పలు జైళ్ల నుంచి విడుదలయ్యారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్​కు చెందిన రామి అబ్దుర్ రెహ్మాన్ తెలిపారు. (Associated PressAssociated Press)
గత 10 రోజుల్లో అలెప్పో, హోమ్స్, హమా, డమాస్కస్‌ సహా పలు నగరాల్లోని ఖైదీలను తిరుగుబాటుదారులు విడిపించారని పేర్కొన్నారు. (Associated Press)
తన కుమారుడి కోసం రెండు గంటల నుంచి వెతుకుతున్నానని ఓ వ్యక్తి వాపోయాడు. (Associated Press)
2011లో సిరియా తిరుగుబాటు ప్రారంభమైనప్పటి నుంచి తన కుమారుడు 13 ఏళ్లుగా జైలులో ఉన్నాడని పేర్కొన్నాడు. (Associated Press)
తన కొడుకు జైలు నుంచి విడుదలయ్యాడని కానీ ఎక్కడున్నాడో తెలియడం లేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. (Associated Press)
13ఏళ్ల క్రితం ఓ కారు దొంగతనం కేసులో తన సోదరుడు, మరో కుటుంబ సభ్యుడ్ని జైలులో వేశారని ఓ మహిళ వాపోయారు. (Associated Press)
వారి కోసం వెతుకుతున్నానని, ఇంకా వారి ఆచూకీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. (Associated Press)
డమాస్కస్​లో సంబరాలు చేసుకుంటున్న ప్రజలు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details