తెలంగాణ

telangana

ద్రాక్షలా? మామిడి పళ్లా? 5 అంగుళాల మ్యాంగోస్ చూశారా​- ప్రధాని మోదీకి చాలా ఇష్టమట! - Special Type Mangoes Angoor

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 12:41 PM IST

Special Type Mangoes Angoor : యూపీకి చెందిన ఓ వ్యక్తి తన తోటలో పండిస్తున్న అంగుర్ దానా రకం మామిడి పండ్లు మాత్రం 4-5 అంగుళాల పరిమాణం మాత్రమే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ రకం మామిడి పండ్లను తినేందుకు ఆసక్తి చూపిస్తారట. ఈ మామిడి పళ్లు దాదాపు ద్రాక్ష పళ్లంతే ఉంటాయట. (ETV BHARAT)
ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన ఎస్సీ శుక్లా అనే రైతు తోటలో పండిన అంగుర్ రకం మామిడి పళ్లు 4-5 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. (ETV BHARAT)
అంగుర్ దానా రకం మామిడి పండ్లు చిన్న ద్రాక్ష పళ్లలానే ఉంటాయి. వాటి మాదిరిగానే చెట్లకు ఇవి గుత్తుగుత్తులుగా కాస్తాయి. (ETV BHARAT)
అలాగే ఇవి స్వీట్లు కన్నా తియ్యగా ఉంటాయట. ప్రధాని నరేంద్ర మోదీకి సైతం అంగుర్ దానా రకం మామిడి పండ్లంటే చాలా ఇష్టమట. (ETV BHARAT)
ఈ మామిడి పండ్లను ప్రకృతి ప్రసాదించిన వరంగా అభివర్ణించారు ఎస్సీ శుక్లా. ఒక్కో చెట్టుకు 25-50 గుత్తుల మామిడి పళ్లు కాస్తాయని తెలిపారు. (ETV BHARAT)
ఈ మామిడి పళ్లు పరిమాణం చిన్నదిగా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి కూడా ఈ మామిడి పళ్లను పంపించానని తెలిపారు. (ETV BHARAT)
గత పదేళ్లుగా ఆ అంగుర్ దానా మామిడి చెట్లను పెంచుతున్నారట. (ETV BHARAT)
అంగుర్ దానా మామిడి విత్తనాలను తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తానని శుక్లా పేర్కొన్నారు. (ETV BHARAT)
ప్రపంచంలోని అనేక రకాల మామిడి పండ్ల లభించినా, అంగుర్ దానా వంటివి మాత్రం చాలా అరుదు అని చెప్పుకొచ్చారు. (ETV BHARAT)
అంగుర్ దానా రకం మామిడి చెట్ల కింద ఉంటే ద్రాక్ష తోటలో ఉన్నట్లు ఉంటుందట. (ETV BHARAT)

ABOUT THE AUTHOR

...view details