ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "టమాటా కొబ్బరి చట్నీ" - దీని టేస్ట్​కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే! - Tomato Coconut Chutney

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 1:50 PM IST

Tomato Coconut Chutney Recipe : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ కోసం చాలా మంది కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ ఒకేవిధంగా కాకుండా.. ఈసారి కొబ్బరి, టమాటా చట్నీని తయారు చేసుకోండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Tomato Coconut Chutney
Tomato Coconut Chutney Recipe (ETV Bharat)

How to Make Tomato Coconut Chutney : మార్నింగ్ టిఫెన్స్​లోకి కొబ్బరి చట్నీని చాలా మంది ఇష్టపడతారు. అయితే.. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. అందుకే.. మీకోసం 'టమాటా - కొబ్బరి చట్నీ' రెసిపీ తీసుకొచ్చాం. చాలా తక్కువ పదార్థాలతో.. తక్కువ టైమ్​లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ మస్త్ ఉంటుంది! మరి, ఈ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - 300 గ్రాములు
  • నూనె - 4 టీస్పూన్లు
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • శనగపప్పు - ఒక టీస్పూన్
  • మినప పప్పు - ఒక టీస్పూన్
  • ఎండుమిర్చి - 6
  • పచ్చిమిర్చి - 6
  • కరివేపాకు - 1 రెబ్బ
  • పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - గోలి సైజంత

తాలింపు కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన టమాటా, పచ్చి కొబ్బరిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని రెండు టీస్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప పప్పు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.
  • తాలింపు బాగా వేగిందనుకున్నాక.. అప్పుడు కారం గల పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోసారి మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి ముక్కలను వేసి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత అదే పాన్​లో రెండు టీస్పూన్ల నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా మగ్గించుకోవాలి.
  • టమాటా ముక్కలు బాగా మగ్గాయనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. ఆపై దాన్ని ముందుగా మిక్సీ జార్​లోకి తీసుకున్న కొబ్బరి మిశ్రమంలో వేసుకోవాలి.
  • అలాగే.. ఉప్పు, చింతపండు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి.
  • ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
  • తాలింపు వేగాక దాన్ని మిక్సీ పట్టుకున్న పచ్చడిలో కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "టమాటా కొబ్బరి చట్నీ" రెడీ!
  • ఈ చట్నీని దోశలు, గారెలు.. ఇలా టిఫెన్స్​లోకి మాత్రమే కాదు అన్నంలో వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది!

ఇవీ చదవండి :

అదుర్స్ అనిపించే "హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ" - రుచికే కాదు ఆరోగ్యానికీ ఈ పచ్చడి మంచిదే!

టిఫెన్​ స్పెషల్​ : "రాయలసీమ పల్లీ చట్నీ" - పదే పది నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.