ETV Bharat / state

భద్రాచలం వద్ద 48 అడుగులకు గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Godavari rising at Bhadrachalam

Godavari Rising at Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Godavari rising at Bhadrachalam
Godavari rising at Bhadrachalam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2024, 7:04 PM IST

Updated : Sep 10, 2024, 7:53 PM IST

Godavari Rising at Bhadrachalam : ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాలు, కల్యాణ కట్ట వద్ద చాలా మెట్లు వరదనీటిలో మునిగాయి. శబరి నది పోటెత్తడంతో భద్రాచలం దిగువన ముంపు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరి పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన శ్రీరాం సాగర్ బ్యారేజి నుంచి వరదనీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింత పెరుగుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి లక్షా 50 వేల క్యూసెక్కుల వరద వస్తోందని అన్నారు. ఇంద్రావతి, సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ప్రవాహం వస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుంచి దిగువకు 10,32,816 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. పట్టణంలో బ్యాక్ వాటర్​ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా స్లూయిజ్​ల వద్ద గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉద్ధృతి : చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదనీటి ఉద్ధృతి తగ్గింది. ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గోదావరి వరద 50 అడుగులకు చేరినట్లయితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు ప్రయాణాలు నిలిచిపోయే అవకాశం ఉంది. గణేశ్ ఉత్సవాలు ముగుస్తున్న సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తెచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అందుకోసం మూడు లాంచీలు, ఆరు క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు.

భద్రాచలం వద్ద 46.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - Godavari rising at Bhadrachalam

మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం - పార్వతి బ్యారేజ్​కు పెరుగుతున్న వరద - Flood Inflow To Parvati Barrage

Last Updated : Sep 10, 2024, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.