India VS Australia Annual Salary : ప్రపంచ దేశాల్లో ఇండియా, ఆస్ట్రేలియాలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. ఓ క్రీడగానే కాకుండా తమ సంస్కృతిలో భాగంగా భావిస్తారు. భారతదేశంలో క్రికెట్ ఓ మతమైతే, ఆస్ట్రేలియాలో నేషనల్ ప్యాషన్. ఈ స్థాయిలో క్రికెట్ పాపులర్ అయింది కాబట్టే ఇతర దేశాల క్రికెటర్‌ల కన్నా వీరు ఎక్కువ సంపాదిస్తున్నారు. మరి ఈ రెండు దేశాల్లో ఏ జట్టు ఆటగాళ్ల ఆదాయం ఎక్కువ? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
- భారత క్రికెటర్ల సంపాదన
ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా గుర్తింపు పొందింది. బీసీసీఐ తన అగ్రశ్రేణి ఆటగాళ్లకు మంచి వేతనాలు అందజేస్తుంది. ఉదాహరణకు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సూపర్ స్టార్లు బీసీసీఐ కాంట్రాక్ట్‌లలోని టాప్ గ్రేడ్ A+ కేటగిరీ కింద సంవత్సరానికి రూ.7 కోట్ల వరకు సంపాదిస్తారు. అయితే ఇది వారి ఆదాయంలో ఓ భాగం మాత్రమే. ఎక్కువగా ఐపీఎల్ నుంచి సంపాదిస్తారు. ఇక అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల రూపంలోనూ భారీ ఇన్‌కమ్ పొందుతున్నారు. ఇవన్నీ కలిపితే భారత స్టార్ ఆటగాళ్ల సంపాదన రూ.వందల కోట్లలో ఉంటుంది. - ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాలు ఎలా ఉంటాయి?
క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కూడా తమ ఆటగాళ్లకు మంచి జీతాలు అందిస్తోంది. ఉదాహరణకు పాట్ కమ్మిన్స్ దాదాపు AUD 2 మిలియన్లు, అంటే దాదాపు రూ.16 కోట్లు అందుకుంటున్నాడు. ఇందులో జట్టు కెప్టెన్‌గా ఉన్నందుకు బోనస్ కూడా ఉంది. డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ఇతర స్టార్ ఆటగాళ్లు కూడా అధిక జీతాలు పొందుతున్నారు. వార్నర్ ప్రతి సంవత్సరం దాదాపు రూ.12 కోట్లు (AUD 1.5 మిలియన్లు) సంపాదిస్తాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా మ్యాచ్ ఫీజులను సంపాదిస్తారు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లు వారి మొత్తం ఆదాయాన్ని భారీగా పెంచుతాయి. భారతీయ క్రికెటర్ల తరహాలోనే, చాలా మంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు ఐపీఎల్ ఆడుతున్నారు. ఈ రకంగానూ వారికి ఆదాయం పెరుగుతోంది. వాస్తవానికి కొంతమంది ఆటగాళ్ళు తమ క్రికెట్ బోర్డులు అందించే జీతాల కన్నా ఐపీఎల్ నుంచి ఎక్కువ సంపాదిస్తున్నారు. ఉదాహరణకు, 2024 ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ ఏకంగా రూ.20 కోట్లకు పైగా అందుకున్నారు.
- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల ఆదాయం
నేషనల్ కాంట్రాక్ట్స్ పరంగా భారత ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు కాస్త ఎక్కువ సంపాదిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఐపీఎల్ ఎక్కువ వ్యత్సాసం చూపిస్తుంది. ఐపీఎల్ జీతాలు, ఎండార్స్‌మెంట్‌లు, అడ్వర్టైజ్‌మెంట్‌లు కలిపితే ఇండియన్ ప్లేయర్ల ఇన్‌కమ్ ఎక్కువగా ఉంటుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
రంజీ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది? అసలా పేరు ఎలా వచ్చిందంటే? - Ranji Trophy History
ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో శుభమన్ గిల్ డేటింగ్! - ఫొటోస్ వైరల్ - Shubman Gill Dating with Heroines