ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.. మెక్సికో. అమెరికా. కెనడాలో పలు ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతం దర్శనమిచ్చింది.. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు గ్రహణ ప్రభావిత దేశాల్లోని వీక్షణా ప్రాంతాలకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.. నల్ల కళ్లద్దాలు. ఇతర రక్షణ పరికరాల సాయంతో సూర్యగ్రహణాన్ని వీక్షించారు.. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది.. గ్రహణం సమయంలో చందమామ సూర్యుడిని పూర్తిగా కప్పేసింది.. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి.. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది.. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణాల్లో సోమవారం ఏర్పడిన గ్రహణం అత్యంత సుదీర్ఘమైంది.. దాదాపు ఒక శతాబ్దకాలంలో న్యూయార్క్ రాష్ట్రంలోని పశ్చిమ. ఉత్తర ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.. సోమవారం ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం చరిత్రాత్మక ఖగోళ సంఘటన అని పేర్కొన్నారు.. ఇలాంటి గ్రహణాన్ని మళ్లీ అమెరికన్లు చూడాలంటే 2044 ఆగస్టు వరకు వేచిచూడాల్సిందేనట.. అంతకుముందు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నప్పుడు భద్రత తప్పనిసరిగా పాటించాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గట్టి హెచ్చరిక చేసింది.. ఇదే చివరిచూపు కాకూడదంటే గ్రహణాన్ని చూసేటపుడు ఫిల్టర్లు తప్పనిసరిగా వాడాలని నాసా తెలిపింది.. మరోవైపు ఈ ఏడాది ఏర్పడిన తొలి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని భారత్‌కు చెందిన 'ఆదిత్య-ఎల్1' ఉపగ్రహం వీక్షించలేకపోయింది. రోదసిలో దాన్ని ఉంచిన స్థానమే ఇందుకు కారణం.. సోమవారం నాటి సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో భానుడిని పూర్తిగా కమ్మేసిన చందమామ ఆదిత్య-ఎల్1కు వెనుకవైపు ఉంది. అంటే సూర్యుడికి. చంద్రుడికి మధ్యలో అన్నమాట!. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న యువత. అద్దాలతో గ్రహణాన్ని చూస్తున్న చిన్నారి. ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం. సూర్యగ్రహణం వీక్షణ. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న యువతి. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న జంట