తెలంగాణ

telangana

ETV Bharat / photos

రిపబ్లిక్ డే స్పెషల్ విషెస్ - మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు ఇలా చెప్పండి! - Republic Day 2024 Quotes in Telugu

Republic Day 2024: ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఏటా ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు.. యావత్ భారతావని 75వ గణతంత్ర వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల వేళ.. మీ ఆత్మీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ప్రత్యేకంగా చెప్పండి. దేశభక్తిని పెంపొందించే మహణీయుల కోట్స్​ను వారికి షేర్ చేయండి.

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 7:36 PM IST

Updated : Jan 25, 2024, 9:23 AM IST

మనమంతా భారతమాత బిడ్డలం.. భిన్నత్వంలో ఏకత్వమే మన తత్వం - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఆకాశాన ఎగరాలి మన మువ్వన్నెల నిండా.. దేశభక్తి ఎదగాలి మన గుండెల నిండా.. - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కంటికి కన్ను సిద్ధాంతంతో ప్రపంచం మొత్తం అంధత్వంలో మునిగిపోతుంది - మహాత్మా గాంధీ
మహోన్నతమైన వారసత్వం మనది.. మహోజ్వలమైన చరిత్ర మనది.. భరత దేశంలో పుట్టినందుకు గర్వించు.. భారతీయుడిగా జీవిస్తున్నందుకు ఆనందించు.. - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మీ రక్తం మరగకపోతే.. అది నెత్తురు కాదు నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే భారతీయుడివి కాదు - చంద్రశేఖర్ ఆజాద్ .
దేశం మీద నాకున్న బాధ్యతకు హద్దుల్లేవ్.. భరత జాతిపట్ల నాకున్న ప్రేమకు కొలమానాల్లేవ్. భారత్ మాతాకీ జై - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జీవితాన్ని ప్రేమిస్తాం.. మరణాన్నీ ప్రేమిస్తాం.. ఉరికంభాన్ని ఎగతాళి చేస్తాం.. నిప్పురవ్వలపై నిదురిస్తాం - భగత్ సింగ్
ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశం మేల్కొంటుంది.. రేపటి ఉషోదయం కోసం.. స్వేచ్ఛాస్వాతంత్య్రాల సంబరాలకోసం.. - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్య్రం వచ్చెననీ సంబరపడిపోతే సరిపోదోయి.. ఆగకోయి భారతీయుడా.. సాగవోయి ప్రగతి దారులా.. - శ్రీ శ్రీ
భారతదేశంలో మీరు కోరుకుంటున్న మార్పు మీ నుంచే మొదలు పెట్టండి.. మీ ఇంటి నుంచి ప్రారంభించండి.. మీరే నాయకుడిగా మార్గనిర్దేశం చేయండి - గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Last Updated : Jan 25, 2024, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details