మహా కుంభమేళాలో 42 కోట్ల మంది పుణ్యస్నానాలు - MAHA KUMBH 2025 DEVOTEES
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/1200-675-23510143-thumbnail-16x9-mela.jpg)
Maha kumbh 2025 Devotees : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 42కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కి.మీ మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి. (Associated Press)
Published : Feb 10, 2025, 7:30 AM IST