తెలంగాణ

telangana

ETV Bharat / photos

మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు - MAHAKUMBH MELA 2025

Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 40కోట్లు దాటింది. శుక్రవారం పుణ్యస్నానాలు ఆచరించిన 48లక్షల మందితో 40కోట్ల మైలురాయిని చేరుకున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26వ తేదీ వరకు జరగనుంది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2025, 5:08 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 40 కోట్లు దాటినట్లు యూపీ సర్కారు ప్రకటించింది. (Associated Press)
శుక్రవారం 48 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా మొత్తంగా 40 కోట్ల మైలురాయి దాటినట్లు తెలిపింది. (Associated Press)
జనవరి 13వ తేదీ ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి వరకు జరగనుంది. (ETV bharat)
దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. (Associated Press)
మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమినాడు కోట్లాది మంది త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు. (Associated Press)
ఒక్క మౌనీ అమావాస్య రోజే రికార్డు స్థాయిలో 8 కోట్ల మంది అమృత స్నానాలు చేయడం గమనార్హం. (ETV bharat)
మకర సంక్రాంతి పర్వదినాన మూడున్నర కోట్ల మంది, వసంత పంచమి నాడు 2కోట్ల 57 లక్షల మంది అమృత స్నానాలు ఆచరించారు. (Associated Press)
జనవరి 30, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు కోట్ల మంది చొప్పున, పుష్య పౌర్ణమి నాడు కోటి 70 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు. (Associated Press)
మహాకుంభమేళాకు హాజరైన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా ఉన్నారు. (Associated Press)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పుణ్యస్నానం చేశారు. (Associated Press)
సినీ రంగానికి చెందిన హేమమాలిని, అనుపమ్‌ఖేర్‌, ఒలింపిక్‌ పతక విజేత సైనా నెహ్వాల్‌, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా కుంభమేళాకు వచ్చారు. (Associated Press)
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. (Associated Press)
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహా కుంభమేళాకు సోమవారం వచ్చి, ప్రత్యేక పూజలు చేస్తారని యూపీ సర్కారు వెల్లడించింది. (Associated Press)
మహా కుంభమేళా (Associated Press)
మహా కుంభమేళా (Associated Press)
మహా కుంభమేళా (ETV Bharat)
మహా కుంభమేళా (Associated Press)

ABOUT THE AUTHOR

...view details