Japan Pig Cafe : జపాన్‌లో పందుల కేఫ్(పిగ్ కేఫ్)కు జనాలు క్యూ కడుతున్నారు. మిపిగ్ అనే కేఫ్‌లో ఉన్న పందులను కౌగిలించుకుంటున్నారు.. పందులతో కాసేపు గడపం వల్ల ఆహ్లాదంగా. రిలాక్స్‌గా ఉంటుందని అంటున్నారు.. ఉదయం నుంచే జనాలు మిపిగ్ కేఫ్ వద్ద పదుల సంఖ్యలో ఉంటున్నారు. పందులతో సెల్ఫీలు సైతం దిగుతున్నారు.. అయితే మిపిగ్ కేఫ్‌లో ఉన్న పందులు సందర్శకులు వచ్చినప్పుడు అంతగా గురకపెట్టట్లేదు.. అందుకే పందులను చూసేందుకు జనం మరింత ఆసక్తి చూపిస్తున్నారు.. మిపిగ్ కేఫ్‌లో ఉన్న పందులను చూడడానికి వచ్చిన వారు 30 నిమిషాలకు 2.200 యెన్(భారత కరెన్సీ ప్రకారం రూ.1240) చెల్లిస్తున్నారు.. మిపిగ్ కేఫ్‌లో ఉన్న ప్రతి పంది ప్రత్యేకమైనదని ఆ కేఫ్ ఎగ్జిక్యూటివ్ షిహో కిటగావా తెలిపారు.. అక్కడ ఉన్న పందులను ముద్దుగా బుటా-సాన్గా పిలుస్తామని చెప్పారు. ఇప్పటివరకు 1.300 పందులను విక్రయించినట్లు వెల్లడించారు.. జపాన్‌లోని టోక్యోలో 2019లో తొలి పందుల కేఫ్‌ను నెలకొల్పారు. తాజాగా హరాజుకులో మిఫిగ్ కేఫ్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.. మిపిగ్ కేఫ్‌లో ఉన్న బేబీ పిగ్‌లను చూసేందుకు సందర్శకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.. పందులపై ఇష్టం ఉన్నవారు మిపిగ్ కేఫ్ నుంచి 2.00.000 యెన్ ( భారత కరెన్సీ ప్రకారం రూ.112892) పెట్టి కొనుగోలు చేయవచ్చు.. మిపిగ్లో ఉన్న పందులకు మనుషులతో కలిసి ఉండడం అలవాటు చేశారు.. మిపిగ్ కేఫ్ గురించి విదేశీ పర్యటకులు ఇన్స్టాగ్రామ్. ఇతర సోషల్ మీడియాల ద్వారా తెలుసుకున్నారు.. జపాన్‌కు సందర్శనకు వచ్చినప్పుడు వారు మిపిగ్ కేఫ్‌ను చూసి వెళ్తున్నారు.. న్యూజిలాండ్. ఆస్ట్రేలియా సహా పలు దేశాలకు చెందిన పర్యటకులు మిపిగ్ కేఫ్‌లోని పందులను చూసేందుకు వస్తున్నారు.. పందులను ఒక చోట ఉంచడం వల్ల అవి ఒత్తిడికి గురవుతాయని పీస్ హెడ్ సచికో అజుమా అన్నారు.. జంతువులు డబ్బు సంపాదించే వ్యాపారానికి సాధనాలుగా మారాయని ఆమె విమర్శించారు.. పెంపుడు జంతువులతో గడపడం వల్ల మనుషులు మానసిక. శారీరక ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. బీపీ. తలనొప్పి. గుండె వ్యాధుల నుంచి బయటపడొచ్చని కార్నెల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ వెటర్నరీ ప్రొఫెసర్ బ్రూస్ కోర్న్రిచ్ తెలిపారు.