తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 4:10 PM IST

ETV Bharat / photos

బైక్​లపై మహిళ సైనికుల ప్రదర్శన అదుర్స్​- నారీమణుల పరేడ్​ ఫొటోలు చూశారా?

India Republic Day Women Parade : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో నారీశక్తిని చాటేలా మహిళ సైనికులు చేసిన సాహస కృత్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేశాయి. ద్విచక్రవాహనంపై త్రివిధ దళాలకు చెందిన మహిళా సైనికులు చేసిన విన్యాసాలు అతిథులను ఊపిరి బిగపట్టేలా చేశాయి.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా ఈ సారి పరేడ్‌ను నిర్వహించారు.
నారీ శక్తిని చాటుతూ ద్విచక్ర వాహనాలపై మహిళా సైనికులు చేసిన విన్యాసాలు అబ్బుర పరిచాయి. మోటార్ సైకిళ్లపై 265 మంది మహిళలు ధైర్యం పరాక్రమాన్ని ప్రదర్శించారు.
ద్విచక్రవాహనంపై సాయుధ బలగాలకు చెందిన మహిళా సైనికులు చేసిన సాహస కృత్యాలు ప్రేక్షకులను ఊపిరిబిగపట్టేలా చేశాయి.
చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు మన సైనిక అమేయ శక్తిని చాటిచెప్పారు. దేశ భద్రతలో మన నారీశక్తిని వీక్షించి భారతీయులు ఉప్పొంగిపోయారు.
ఆవాహన్‌తో పరేడ్‌ను మొదలుపెట్టారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాద స్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.
మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా ఆయుధ లొకేషన్‌ గుర్తింపు రాడార్‌, పినాక రాకెట్‌ వ్యవస్థలకు నేతృత్వం వహించారు.
చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీర్‌లు కూడా ఉన్నారు.
ఎయిర్‌ఫోర్స్‌ మార్చ్‌కు స్క్వాడ్రన్‌ లీడర్లు రష్మీ ఠాకుర్‌, సుమితా యాదవ్‌, ప్రతిథి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్‌ కిరిట్‌ రొహైల్‌ నేతృత్వం వహించారు.
260 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌ఎఫ్‌ మహిళా బ్రాస్‌ బ్యాండ్‌ ఈ పరేడ్‌లో పాల్గొంది.
300 ఏళ్ల బాంబే శాపర్స్‌ రెజిమెంట్‌ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగికి ఈ అవకాశం దక్కింది.
దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు.
అయోధ్య రామాలయ ప్రత్యేకతను తలపించేలా ఉత్తర్ ప్రదేశ్ ప్రదర్శించిన శకటం ఆకట్టుకుంది. చంద్రయాన్ -3 విజయానికి గుర్తుగా ఇస్రో ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్‌ డే పరేడ్‌ నిర్వహించారు.
ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి
రిపబ్లిక్ డే పరేడ్​లో నారీ శక్తి

ABOUT THE AUTHOR

...view details