Babar Azam Captaincy : పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసిన బాబార్ తాజాగా వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. తన నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా తెలిపినట్లు చెప్పాడు. పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కడం తనకు ఎంతో గౌరవం అని అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.
'డియర్ ఫ్యాన్స్, మీతో ఓ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పాకిస్థాన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేస్తున్నా. నా నిర్ణయాన్ని గతనెల పీసీబీ మేనేజ్మెంట్కు చెప్పాను. పాక్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా చేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవం. ఇదొక మంచి అనుభవం. కానీ, ఇది కాస్త పనిభారం పెంచుతుంది. నేను పూర్తిగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. అలాగే నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నా. అందుకే కెప్టెన్సీ వదులుకుంటున్నా. ఓ ప్లేయర్‌గా పాకిస్థాన్ క్రికెట్‌కు నా అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తా. ఇన్ని రోజులు నాకు మద్దతుగా నిలిచిన మేనేజ్మెంట్, ఫ్యాన్స్‌కు థాంక్స్' అని బాబర్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
Dear Fans,
— Babar Azam (@babarazam258) October 1, 2024
I'm sharing some news with you today. I have decided to resign as captain of the Pakistan men's cricket team, effective as of my notification to the PCB and Team Management last month.
It's been an honour to lead this team, but it's time for me to step down and focus…
కాగా, బాబర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో స్థానం కోల్పోయిన కాసేపటికే తన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఇక ఏడాదిలో బాబర్ కెప్టెన్సీ వదులుకోవడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో బాబర్ ఆజమ్ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.
Babar Azam Captaincy Record : ఇక బాబర్ 2019లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పట్నుంచి పాకిస్థాన్ జట్టును అన్ని ఫార్మాట్లలో సమర్థంగా నడిపించాడు. బాబర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ మూడు ఫార్మాట్లలో 84 మ్యాచ్‌లు నెగ్గింది. పాక్ క్రికెట్లో రెండో అత్యత్తమ కెప్టెన్‌గానూ నిలిచాడు. కానీ, గత ఏడాదిగా పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్, 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైంది.