Heavy Rains in Hyderabad Today : అర్థరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. చాలాచోట్ల పది సెంటీమీటర్లకుపైనే కురిసిన వానకు, ఇళ్లలోకి నీరుచేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది. జీఎం, డీజీఎం, మేనేజర్‌తో జలమండలి ఎండీ జూమ్‌లో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు. (Hyderabad Floods 2024)