భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో మహా కుంభమేళా ఒకటి. సాధువులు. సన్యాసులతో పాటు కోట్లాది మంది భక్తులు 12ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభ మేళాకు హాజరవుతారు.. జనవరి13 నుంచి 45రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భక్తుల అవసరాలు. భద్రత కోసం యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లను వాడనుంది. అలాగే కుంభమేళాలో పాల్గొనేవారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడానికి సరికొత్త సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు.. మహాకుంభమేళాలో పాల్గొనేవారి సంఖ్య ప్రపంచ జనాభాలో 5 శాతం ఉంటుందని అంచనా. అలాగే పాకిస్థాన్ మొత్తం జనాభా కంటే రెట్టింపు ఉంటుందట. అలాగే అమెరికా. రష్యా జనాభా కంటే కూడా ఎక్కువట.. భక్తుల కోసం యూపీ ప్రభుత్వం 1.5 లక్షల పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రతి లక్ష మంది భక్తులకు 2.666 టాయిలెట్లు అన్నమాట.. 2019 ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్ధ కుంభమేళాలో 13.218 టన్నుల ఆహార ధాన్యాలు వినియోగించారు. అంటే గోల్డెన్ టెంపుల్ లంగర్లో రోజువారీ వినియోగంతో పోలిస్తే చాలా ఎక్కువ.. మహా కుంభమేళా 4.000 హెక్టార్లలో జరగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం (నరేంద్ర మోదీ స్టేడియం) కంటే 160 రెట్లు పెద్దది. అలాగే 82 వాటికన్ సిటీల విస్తీర్ణంతో సమానం.. రామాలయ నిర్మాణం కంటే కుంభమేళా నిర్వహణకు అయ్యే ఖర్చు మూడు రెట్లు ఎక్కువని అంచనా. కుంభమేళా నిర్వహణకు రూ.6.382 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.. కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కన్నా 10రెట్లు ఎక్కువని అంచనా.. జనవరి 14 (మకర సంక్రాంతి). జనవరి 29 (మౌనీ అమావాస్య). ఫిబ్రవరి 3 (వసంత పంచమి) తేదీలల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తులకు నమ్మకం. అందుకే ఆ రోజు భక్తులు ఎక్కువగా హాజరవుతారు.