Myanmar Floods 2024 : మయన్మార్‌ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. టైఫూన్ యాగీ తుపానుతో భారీ వరదలు పోటెత్తాయి. దీంతో మృతుల సంఖ్య 74కు చేరింది. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. వరదలకు లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఆపదలో ఉన్న తమ దేశాన్ని ఆదుకోవాలని అక్కడి సైనిక పాలక వర్గం జుంటా విదేశీ సాయాన్ని అభ్యర్థించింది! (Associated PresAssociated Presss)